Ananya Nagalla : 'నేనింకా సింగిలే - నాకు అలాంటోడు కావాలి - ఎవరైనా ఉన్నారా?'

అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందంతో పాటు అంతకు మించిన నటనను కనబరుస్తూ.. విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు అమ్మాయిలకు కూడా అవకాశాలు వస్తాయని ప్రూవ్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఇంకా సింగిల్ అని చెప్పుకొచ్చింది. ఎవరూ ప్రపోజ్ చేయట్లేదని.. అలాంటి వాడు అయితే తనకు కావాలని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మల్లేశం సినిమాతో 2019లో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఆ తర్వాత ప్లే బ్యాక్ సినిమాలో చేసింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలోనూ కనిపించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువైంది. ఆ తర్వాత మాస్ట్రో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, అన్వేషి, బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాల్లోనూ కనిపించింది. ఇలా వచ్చిన అవకాశాలు అన్నింటినీ అందిపుచ్చుకుంటూ సాఫీగా కెరియర్ కొనసాగిస్తున్న ఈమె.. తాజాగా తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Ananya Nagalla Siad She Still Single And Want Some One to propose Check Details

ముఖ్యంగా హర్రర్ సినిమాతో రాబోతున్న ఈమె వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటుంది. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటుంది. చిత్రబృందం కలిసి సెపరేట్ గా కూడా ఇంటర్వ్యూలో ఇస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేసింది. తనకు ఇప్పటి వరకూ ఎవరూ ప్రపోజ్ చేయలేదని.. నేనింకా సింగిల్ యే అంటూ వెల్లడించింది. ముఖ్యంగా తనకు ఎక్కువగా ప్రపోజల్స్ రాకపోవడానికి గల కారణాలను కూడా వివరించింది.

సినీ రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఎక్కువగా కమిటెడ్ యే ఉంటారనే భావనతోనే ఎవరూ తనకు ప్రపోజ్ చేయలేదేమోనని తాను అనుకుంటున్నట్లు వివరించింది. అలాగే తనకు కాబోయే భర్త ఏ పని చేసినా పర్లేదు అని వెల్లడించింది. కానీ సినీ రంగానికి చెందిన వాడు మాత్రం కాకపోతే చాలని చెప్పింది. సినీ రంగంలో ఉండి అలాంటి అబ్బాయిని ఎందుకు వద్దు అంటున్నావని యాంకర్ అడగ్గా.. సినీ రంగానికి చెందిన వాళ్లు తనకు సెట్ కారని చెప్పుకొచ్చింది. సెట్ కావడం అనడం కంటే కూడా తామిద్దరి మధ్య బంధం సరిగ్గా సాగదేమోనని అనుమానం వ్యక్తం చేసింది.

Ananya Nagalla Siad She Still Single And Want Some One to propose Check Details

సామాన్యంగా సినిమాల్లో ఉండే వాళ్లకు చాలా మంది కొత్త వాళ్లు కనిపిస్తారని.. ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని.. అప్పుడే అబ్బాయికి తాను బోర్ కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలిపింది. అందుకే సినీ రంగానికి చెందిన వారిని తాను పెల్లి చేసుకోవాలనుకోవట్లేదని.. ఏదైనా బిజినెస్, సాఫ్ట్ వేర్ వంటి జాబ్స్ చేసినా చాలని చెప్పుకొచ్చింది. అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే తనకు ప్రపోజ్ చేయొచ్చని కూడా ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X