For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ హాట్ అవతార్ లో అనన్య నాగళ్ళ.. పొట్టిబట్టల్లో రెచ్చిపోయిందిగా!

  |

  ఈ మధ్య తెలుగు అమ్మాయిలు కూడా సినీ రంగంలో ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తెలుగు అమ్మాయిలు సినీ రంగంలో ప్రవేశించి మంచి స్థానంలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ళ కూడా ఒకరు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన ఆమె అనూహ్యంగా సినీ రంగంలో ప్రవేశించి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈమధ్య అవకాశాలు తగ్గడంతో హాట్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ భామ తాజాగా తన వెకేషన్ నుండి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  సినీ రంగం మీద ఆసక్తి

  సినీ రంగం మీద ఆసక్తి

  తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన అనూష నాగళ్ళ తన తండ్రి దండ్రుల ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వచ్చేసింది. చిన్ననాటి నుంచి హైదరాబాదులోనే పెరిగిన అనూష ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇన్ఫోసిస్ లో ఉద్యోగం కూడా తెచ్చుకుంది. అయితే నటన మీద ఆమెకున్న ఆసక్తితో స్నేహితులు చేస్తున్న షాదీ అనే ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఆ షార్ట్ ఫిలింకి ఏకంగా సైమా అవార్డు లభించడంతో ఆమెకు సినీ రంగం మీద ఆసక్తి పెరిగింది.

  మంచి మార్కులు

  మంచి మార్కులు


  అదే సమయంలో తెలంగాణ నుంచి ఆసు యంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలుసుకొని ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ కి వెళ్ళింది. ఆ అడిషన్స్లో సెలెక్ట్ అవడంతో ప్రియదర్శి సరసన ఆయన భార్య పాత్రలో నటించి మంచి మార్కులు సంపాదించింది. మొదటి సినిమాలో అనూషగా పరిచయం అయిన ఆమె తన పేరు కూడా మార్చుకుంది.

  పవన్ కళ్యాణ్ సరసన

  పవన్ కళ్యాణ్ సరసన

  ఇక ఆ సినిమా అయిన వెంటనే ఆమెకు ప్లేబాక్ అనే ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీలో అవకాశం దొరికింది. కానీ కరోనా కారణంగా ఆ సినిమా రెండు సంవత్సరాలు ఆలస్యమై ఎట్టకేలకు 2021వ సంవత్సరంలో విడుదలైంది. అదే ఏడాది ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కింది. వకీల్ సాబ్ సినిమాలో అన్యాయానికి గురైన ముగ్గురమ్మాయిలలో ఒకరిగా నటించి తన నటనకు గాను మంచి ప్రశంసలు దక్కించుకుంది అనన్య నాగళ్ళ.

  మరో ప్రాజెక్ట్ లేదు

  ఇక ఆ తర్వాత ఆమె నితిన్ హీరోగా మాస్ట్రో పేరుతో తెరకెక్కిన సినిమాలో నటించింది. ఈ సినిమాలో తమన్నా సవతి కూతురు పాత్రలో నటించిన అనన్య నటనకు మంచి మార్కులు అందుకుంది గాని ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెకు మళ్ళీ పెద్దగా అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతానికి ఆమె సమంత హీరోయిన్గా నటిస్తున్న శాకుంతలం అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ది పూర్తయిన తర్వాత ఆమెకు చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు.

  అనన్య సూపర్ హాట్

  ఈ నేపథ్యంలోనే వరుస ఫోటో షూట్లతో ఆమె దర్శకనిర్మాతల కళ్ళల్లో పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత కొద్ది నెలలుగా ఆమె షేర్ చేస్తున్న ఫోటోషూట్లు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె విదేశాలకు వెకేషన్ కి వెళ్లి అక్కడి నుంచి కూడా పొట్టి బట్టల్లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె తొడల అందాలతో పాటు తన బ్యాక్ అందాలను చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పొట్టి బట్టల్లో ఆమెను చూసిన అభిమానులు అనన్య సూపర్ హాట్ అంటూ రకరకాల కామెంట్ చేయడం మొదలుపెట్టారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దానిమీద ఒక లుక్కేసేయండి మరి.

  English summary
  Ananya nagalla sizzles through her hot photoshoot from recent vacation, which gone viral in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X