Ananya Panday : మూడేళ్ల ప్రేమ బంధానికి గుడ్ బై.. ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన లైగర్ బ్యూటీ
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే బ్రేకప్ వ్యవహారంపై బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. యువ హీరోతో అఫైర్ కొనసాగిస్తుందనే వార్తలు ఈ మధ్య కాలంలో మీడియాలో వినిపిస్తుండటం తెలిసిందే. అయితే ఒక నెల క్రితం కూడా ఒక బర్త్ డే పార్టీలో తన ప్రియుడితో కలిసి కనిపించిన ఈ భామ ఇప్పుడు బ్రేక్ అప్ చెప్పేసింది అని వార్తలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి వెళితే

స్టార్ హీరోయిన్ గా మారి ఎందుకు
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా మారేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న అనన్య పాండే 2020లో ఇషాన్ కట్టర్‌తో కలిసి ఖాలీ పీలీ సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటిటిలో విడుదలైంది.
ఆ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది ప్రేమ వరకు దారితీసిందని అంటూ ఉంటారు. ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్స్‌కు వెళ్లడం, కలిసి చెట్టాపట్టాలేసుకొని కనిపించడంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతారని బాలీవుడ్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

నేషనల్ పార్క్ లో కెమెరా కంటికి
అనన్య పాండే, ఇషాన్ కట్టార్ కలిసి కొన్నాళ్ల క్రితం రాంథాంబర్ నేషనల్ పార్క్‌కు విహార యాత్రకు వెళ్లడంతో వారి అఫైర్ గురించి కొంత సూచనలు చేసినట్లు అయింది. వారిద్దరూ కలిసి ఆ టూర్ మొత్తం ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దెబ్బకు వీరి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో ఇషాన్ తల్లి నీలిమా ఆమధ్య అదేమీ లేదని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

బ్రేకప్ చెప్పుకున్నారని
అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో 'ప్రేమ పక్షులు'గా మారిన అనన్య పాండే మరియు ఇషాన్ ఖట్టర్ అభిమానులకు ఒక చేదు వార్త బయటకు వచ్చింది. బి-టౌన్ మీడియా సహా సోషల్ మీడియా సెలవుల వరకు, ఈ క్యూట్ జంట విడిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ వార్తలు అందించే ఒక వెబ్సైట్ రిపోర్ట్ ప్రకారం అనన్య మరియు ఇషాన్ మూడేళ్ల పాటు డేటింగ్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. 'ఖాలీ పీలీ' సినిమా సెట్స్‌లో వీరిద్దరూ కలిశారు. గత కొంతకాలంగా, ఈ జంట తమ రిలేషన్ షిప్ స్టేటస్ కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

కానీ ఫ్రెండ్లీగానే ఉన్నారట
సదరు వెబ్సైట్ రిపోర్ట్ ప్రకారం మూడేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఇప్పుడు ఒకరితో ఒకరు విడిపోయారు. ఇరువురు పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారిద్దరూ విడిపోయారని, అయితే వారు స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తారని సదరు కథనంలో పేర్కొన్నారు. అంతేకాదు భవిష్యత్తులో కలిసి సినిమా చేసే ఛాన్స్ వచ్చినా ఇద్దరూ వెనక్కి తగ్గరు. ఇద్దరూ ఈ బ్రేకప్ నిర్ణయాన్ని పూర్తి అవగాహనతో తీసుకున్నారని, ఈ విషయంలో పూర్తి మెచ్యూరిటీతో ఉండాలని అనుకుంటున్నారు అని తెలుస్తోంది.

సినిమాల విషయానికి వస్తే
ఫ్రెండ్‌షిప్ విషయంలో వారిద్దరికీ అంతా బాగానే ఉంది' అని మంచి తరుణంలో ఈ బంధాన్ని ముగించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇద్దరి మధ్య సఖ్యత కొరవడిందని, అలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి ముందుకు వెళ్లలేకపోయారని, ఇద్దరూ విడిపోతే బాగుంటుందని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అనన్య పాండే కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌లో ఓటీటీలో రిలీజైన ఖాళీపీలీ సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనున్నది. ఆమె పలు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











