ఆ వేధింపులు తట్టుకోలేకపోయా.. ట్రోలింగ్‌పై లైగర్ బ్యూటీ ఎమోషనల్

బాలీవుడ్ యువ నటి అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తన తాజా చిత్రం 'చాంద్ మేరా దిల్' కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి తన నటన కంటే ఒక డాన్స్ సీన్‌తోనే భారీ చర్చకు దారితీసింది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ ప్రేమకథా చిత్రంలో అనన్య చేసిన భరతనాట్యం ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. సంప్రదాయ నృత్యాన్ని సరైన విధంగా ప్రదర్శించలేదంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు ఆమె స్టెప్స్‌ను ఎగతాళి చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వివాదంపై అనన్య పాండే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

బాలీవుడ్ యువ నటి అనన్య పాండే ప్రస్తుతం తన తాజా మూవీ 'చాంద్ మేరా దిల్' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే సినిమా కంటే ఎక్కువగా ఆమె భరతనాట్యం ప్రదర్శనే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన ఓ వీడియో క్లిప్‌లో అనన్య చేసిన భరతనాట్యం స్టెప్స్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు ఆమె డాన్స్‌ను "రోబోటిక్"గా అభివర్ణిస్తే, మరికొందరు సంప్రదాయ భరతనాట్య కళను అవమానించిందంటూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎదురవుతున్న ట్రోలింగ్, నెగెటివిటీ గురించి అనన్య పాండే తాజాగా స్పందించింది.

Ananya Panday Breaks Silence on Bharatnatyam Trolls Shares Her Way of Handling Negativity

ఒక ఇంటర్వ్యూలో ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారు? అనే ప్రశ్నకు అనన్య సమాధానం ఇచ్చింది. "ఇప్పుడు నేను ట్రోలింగ్‌ను డీల్ చేయడం మానేశాను. చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతోంది. మొదట్లో బాధపడేదాన్ని. వేధింపులు తట్టుకోలేకపోయా.. కానీ ఇప్పుడు ఆ నెగెటివిటీకి ప్రాధాన్యత ఇవ్వడం మానేశాను" అని చెప్పింది. సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించేందుకు తాను ప్రారంభించిన "సో పాజిటివ్" అనే కార్యక్రమం గురించి కూడా ఆమె ప్రస్తావించింది. మొదట ఈ కార్యక్రమం ఆన్‌లైన్ బుల్లీయింగ్, ట్రోలింగ్‌పై అవగాహన కల్పించడానికే ప్రారంభమైందని, కానీ ఇప్పుడు అది మరింత సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని తెలిపింది.

అనన్య అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియాను పూర్తిగా దూరం పెట్టడం కంటే, మనకు ఉపయోగపడేలా మార్చుకోవడం చాలా ముఖ్యమట. "నాకు కాస్తైనా ఆందోళన కలిగించే ఇన్‌స్టాగ్రామ్ పేజీలను వెంటనే మ్యూట్ చేస్తాను. ఎందుకంటే సోషల్ మీడియా మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. మనం ప్రతిరోజూ చూసే కంటెంట్ మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే మనకు ఆనందం కలిగించే విషయాలను మాత్రమే ఫాలో కావాలి" అని ఆమె చెప్పింది.

"నిర్మాణాత్మక విమర్శలకు, అర్థం లేని నెగెటివిటీకి చాలా తేడా ఉంది. ఎవరి సలహా తీసుకోవాలి? ఎక్కడ గీత గీయాలి? అనేది తెలుసుకోవాలి. ఎదగడానికి ఉపయోగపడే విమర్శలను స్వీకరించాలి. కానీ కేవలం అవమానించడానికే చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని ఆమె స్పష్టం చేసింది.

ఇక తన నటన, కెరీర్ ఎంపికల విషయంలో సోషల్ మీడియా కామెంట్లు ప్రభావం చూపుతాయా? అనే ప్రశ్నకు కూడా అనన్య ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "నా పనికి సంబంధించిన సలహాలు నేను పనిచేస్తున్న దర్శకుల నుంచే తీసుకుంటాను.నేను పూర్తిగా డైరెక్టర్‌ను నమ్మే నటిని. పాత్రను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నటించాలి అనే విషయాల్లో వారి మార్గదర్శకత్వాన్నే అనుసరిస్తాను. అందుకే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను ఎక్కువగా చదవను" అని తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X