పూరీ జగన్నాథ్ స్క్రిప్టుపై హీరోయిన్ కంప్లైంట్.. అలాంటి అనుభవాలు అంటూ!
ప్రెజెంట్ సౌత్ ఇండియా సినిమా దగ్గర పలువురు బాలీవుడ్ నుంచి అనేకమంది స్టార్ హీరోలు సహా హీరోయిన్స్ కూడా సౌత్ దర్శకులు హీరోలతో వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఇపుడు టోటల్ ఇండియన్ సినిమా అంతా కూడా ఒక్కటే అనే విధంగా సినిమాలు వస్తుండగా నటీనటులు కూడా అంతే స్పోర్టివ్ గా పని చేస్తున్నారు.
కాగా ఒకపుడు హీరోయిన్ సౌత్ సినిమా నుంచి నార్త్ సినిమాకి వెళ్లాలని ప్లాన్ చేసుకునేవాళ్ళు కానీ ఇపుడు ట్రెండ్ మారి తెలుగు సినిమా సత్తా భారీ చాటడంతో ఇప్పుడు నార్త్ హీరోయిన్స్ తెలుగు సినిమాలోకి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా తెలుగు సినిమాలోకి నార్త్ లో భారీ స్టార్డం ఉన్న హీరోయిన్స్ దీపికా పదుకోన్ అలాగే ఆలియా భట్ లాంటి హీరోయిన్స్ సత్తా చాటారు.

కాగా వీరితో పాటుగా ఇప్పుడు బాలీవుడ్ హాట్ బాంబ్స్ జాన్వీ కపూర్ ఇంకా నోరా ఫతేహి కూడా టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తమ అదృష్టాన్ని ఫ్రీకీసించుకోనున్నారు. అయితే వీరితో పాటుగా టాలీవుడ్ లో మరో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే యువ హీరోయిన్ అనన్య పాండే.. బాలీవుడ్ లో మంచి ఫేమ్ అండ్ ఫాలోయింగ్ అనన్యకి ఉన్నాయి.
కాగా ఈమె తెలుగులో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో చేసిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ "లైగర్" చేసి తెలుగు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమెకి మాత్రం మిగతా హీరోయిన్స్ లా మంచి వెల్కమ్ ని తెలుగులో అందుకోలేకపోయింది. దీనితో మళ్ళీ తన బాలీవుడ్ కే వెళ్ళిపోయింది. తదుపరి అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

అయితే తాజాగా టాలీవుడ్ లో ఆమె చేసిన లైగర్ సినిమా విషయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని ఇటీవల పంచుకోవడం ఎదురైంది. ఆమె ఆ సినిమా చేస్తున్న సమయంలో స్క్రిప్ట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని తెలిపింది. అందులో తనకి చాలా అభ్యంతరాలు కనిపించాయి అని అప్పుడు నేను మొహమాటం లేకుండా వాటి కోసం చెప్పానని అందరు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఇలానే చెప్పాలి అంటూ సూచిందింది.
అలాగే అప్పుడు తాను ఇచ్చిన సూచనలు మేరకు లైగర్ యూనిట్ కూడా వెంటనే స్పందించి మార్పులు చేసారని ఆమె తెలిపింది. దీనితో ఇండస్ట్రీ విషయంలో హీరోయిన్స్ ఇలానే ఉండాలి అని కొత్త హీరోయిన్స్ కి తన సైడ్ నుంచి ఇవే చెప్పే జాగ్రత్తలు అన్నట్టు తెలిపింది. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ సహా టాలీవుడ్ వర్గాల్లో కూడా వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











