‘అలాంటి సమయంలో నిస్సహాయతకు లోనవుతా..’: అనన్యా పాండే
Ananya Panday: మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న దారుణాలను జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నివేదిక కేవలం మలయాళ ఇండస్ట్రీలోనే కాదు పలు ఇండస్ట్రీలో ప్రకంపనలు స్రుష్టిస్తోంది. ఈ నివేదిక వెలువడిన తరువాత సినీ పరిశ్రమ నుంచి రోజురోజుకు లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాన్ని పలువురు నటీమణులు స్వయంగా మీడియా ముందుకు తనకు జరిగిన చేదు అనుభవాలను వెల్లడించారు. ఇలా మలయాళం, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఓపెన్‌గా చెప్తున్నారు. యంగ్ హీరోయిన్లు కూడా ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది.
బెంగళూరులో జరిగిన ఇండియా టుడే మైండ్‌రాక్స్ యూత్ సమ్మిట్ 2024లో బాలీవుడ్ నటి అనన్య పాల్గొన్నారు. తరుణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఇండస్ట్రీలో హేమ కమిటీ లాంటి కమిటీలను ఏర్పాటు చేయాలనీ, మహిళల భద్రతలకు పలు చర్యలు తీసుకోవాలని అన్నారు. నేడు మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడానికి ముందుకు వస్తున్నారు. కేవలం మాటలతో సరిపెట్టుకోకుండా ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగాయి. మహిళలపై జరుగుతున్న దారుణాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని అనన్య పాండే అన్నారు. జస్టిస్ హేమ సమితి వంటి అనేక సంస్థలు మహిళల భద్రత కోసం పని చేయడం ప్రారంభించాయన్నాయని తెలిపారు.

నేడు మహిళలకు సాయం చేయడానికి హెల్ప్‌లైన్ నెంబర్స్ అందుబాటులో ఉన్నాయనీ, అలాగే భరోసా కార్యక్రమాలు కూడా ఉన్నాయని అన్నారు. మహిళల భద్రతకు ఇవి చాలా ముఖ్యమనీ, నేడు మహిళల కాంటాక్ట్ లిస్ట్‌లో మహిళల భద్రతకు భరోసా ఇచ్చే కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఉన్నాయనీ,ఎప్పుడైనా ఎక్కడైనా క్షణాల్లో దారుణాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఇది చాలా ముఖ్యమైనదని భావిస్తున్నానని అన్నారు. ఈ సమస్యలు కేవలం సినీ పరిశ్రమలోనే లేవనీ, ప్రతి పరిస్థితిలో ఇలాంటి దారుణాలను అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరారు అనన్యా.
తాజాగా ఈ అమ్మడు 'కాల్ మీ బే' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయిన 'కాల్ మీ బే' సిరీస్‌తో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ వెబ్ సిరీస్‌కే కాదు.. అనన్య పాండే నటనకు కూడా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సిరీస్‌లో 'మీ టూ' మూమెంట్ , మహిళల భద్రతపై అవగాహన కల్పించే తెరకెక్కించారనీ వెల్లడించింది అనన్యా. తన పర్సనల్ లైఫ్‌లో మాట్లాడడానికి ఇబ్బందిపడుతున్నానని అన్నారుు. ఓ నటిగా అప్పుడప్పుడు తాను నిస్సహాయతకు లోనవుతుంటాననీ, ఎందుకంటే తన చుట్టూ ఉన్నవారు అలా మాట్లాడకు, ఇలా మాట్లాడకు, అని సలహాలు ఇస్తుంటారనీ, తాను అలాంటి విషయాలకు వెంటనే ప్రభావితం అయిపోతానని తెలిపింది.

ఇక హేమ కమిటీపై అనన్యా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ప్రతీ ఇండస్ట్రీలో మహిళలంతా ఒక్కటై హేమ కమిటీలాంటి కమిటీలను ప్రారంభించడం చాలా ముఖ్యమనీ, మహిళలకు మహిళలే సాయంగా ఉండాలన్నారు.ఇలాంటి మార్పులు వల్లే మహిళలు ముందుకొచ్చి తమ సమస్యల గురించి మాట్లాడుతున్నారనీ, ఇలాంటి పరిణామాలు ఎన్నో రావాలని అన్నారు.


Click it and Unblock the Notifications











