లైగర్‌పై అనన్య పాండే క్రేజీ అప్‌డేట్.. విజయ్ దేవరకొండతో అలా
బాలీవుడ్‌లోకి సినీ వారసత్వంతో అడుగుపెట్టిన అనన్య పాండే తొలి చిత్రం తర్వాత మెరుగైన గ్రాఫ్‌తో ముందుకెళ్తున్నది. తన రెండో ప్రాజెక్టుగా విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది. అనన్యకు తన కెరీర్ ఆరంభంలోనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.అలాగే బాలీవుడ్ దర్శకుడు శకున్ బాత్రా దర్శకత్వంలో రానున్న చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది.

లైగర్‌తోపాటు బాలీవుడ్ చిత్రం కూడా నాకు ఛాలెంజ్ విసిరే చిత్రాలే. ఆ రెండు చిత్రాల్లోని పాత్రలు విభిన్నమైనవి. నా కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే చిత్రాలుగా మారుతాయి అనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
ఇక బాలీవుడ్ దర్శకుడు శకున్ రూపొందించే చిత్రంలో దీపిక పదుకోన్‌తోపాటు యువహీరో సిద్దాంత్ చతుర్వేది కలిసి అనన్య నటిస్తున్నారు. లైగర్, శకున్ బాత్రా చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అనన్య పాండే కెరీర్ విషయానికి వస్తే.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ ఓ, అగ్రేజి మీడియం, ఖాళీ పీలీ చిత్రాల్లో నటించింది. ఇక అనన్య ప్రముఖ బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురు అనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











