చెబితే చెండాలంగా ఉంటుంది.. ఆ హీరో అంటే పిచ్చి ప్రేమ.. ప్రముఖ హీరో కూతురు కామెంట్

బాలీవుడ్‌కు మరో అందాల భామ అనన్య పాండే పరిచయం కాబోతున్నది. యువ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటిస్తున్నది. అనన్య ప్రముఖ హీరో చుంకీ పాండే కూతురు అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తారా సుతారియా కూడా నటిస్తున్నది. గతంలో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు ఇది సీక్వెల్. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా అనన్య పాండే మీడియాతో తన భావాలు పంచుకొన్నారు. వ్యక్తిగత, కెరీర్ విషయాలతో పాటు తన ఇష్టాఇష్టాలను వెల్లడించారు. చిలిపిగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు మీడియాలో వైరల్‌గా మారాయి. అనన్య ఏం చెప్పారంటే.

కరీనా కపూర్, అలియాభట్‌లో

కరీనా కపూర్, అలియాభట్‌లో

బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా అనన్య... అలియా భట్‌, కరీనా కపూర్ ఖాన్‌లో ఎవరు ఇష్టమని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కరీనా, అలియాలో ఇద్దరూ నాకు ఇష్టం అని అన్నారు. అంతేకాకుండా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో పరిచయమైన వరుణ్ ధావన్ అంటే నాకు మరీ ఇష్టం అని తెలిపారు.

 వరుణ్ ధావన్ అంటే నాకు

వరుణ్ ధావన్ అంటే నాకు

వరుణ్ ధావన్‌లో నాకు బాగా నచ్చే అంశం అతడి ఎనర్జీ. క్యూట్‌గా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారని చెప్పింది. చెప్పడానికి చెండాలంగా ఉంటుంది కానీ.. అతడంటే నాకు చెప్పలేనంత ప్రేమ అని అనన్య మనసులో మాట బయటపెట్టింది. ఈ జనరేషన్ వారికి వరుణ్ తెగ నచ్చేస్తాడు. చలాకీగా కనిపించే అతడంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అని అనన్య పేర్కొన్నది.

ఎప్పటికీ నీవంటే క్రషే అని

ఎప్పటికీ నీవంటే క్రషే అని

వరుణ్ ధావన్‌పై అనన్య పాండే ప్రేమ మాటలకే పరిమితం కాలేదు. ఇటీవల ఈ యువ హీరో బర్త్ డే సందర్భంగా ఓ ప్రేమ సందేశాన్ని పంపింది. హ్యాపీ బర్త్ డే టు స్టూడెంట్. నీవంటే ఎప్పటికీ ఓ క్రష్ అంటూ ట్వీట్ చేసింది. ట్వీట్‌తోపాటు వరుణ్ ధావన్ ఫొటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

కరణ్ జోహర్, సంజయ్ లీలా అంటే ఇష్టం

కరణ్ జోహర్, సంజయ్ లీలా అంటే ఇష్టం

బాలీవుడ్ డైరెక్టర్లలో కరణ్ జోహర్, జోయా అఖ్తర్ అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్షన్ విషయంలో కరణ్.. ఫర్‌ఫెక్షన్ అంశంలో జోయా అఖ్తర్ నాకు నచ్చుతారు. ఇక సంజయ్ లీలా భన్సాలీ వెండితెర మెజీషియన్. ఆయన తీసిన దేవదాస్ చూసి గుక్కపెట్టి ఏడ్చాను. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం కోసం వేచి చూస్తున్నాను అని అనన్య పాండే తెలిపారు.

మరో క్రేజీ ప్రాజెక్టులో అనన్య పాండే

మరో క్రేజీ ప్రాజెక్టులో అనన్య పాండే

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటిస్తుండగానే.. ఆమెను మరో భారీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ తలుపు తట్టింది. పతీ పత్నీ ఔర్ వో అనే చిత్రంలో కార్తీక్ ఆర్యన్‌తో జతకట్టింది. భూమీ పడ్నేకర్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నది. ఇక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ త్వరలోనే విడుదల కానున్నది. కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X