twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్రెండ్స్ తో కలిసి అందాలు ఆరబోస్తున్న అనన్య పాండే.. ఆమెజాన్ కోసం హాట్ ట్రీట్!

    |

    చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే సినీ రంగం మీద ఆసక్తితో 2019వ సంవత్సరంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నెమ్మదిగా క్రేజ్ పెంచుకుంటున్న ఈ భామ తాజాగా తన అందాలు ఆరబోయడానికి ఆసక్తి చూపిస్తోంది. సమయం సందర్భం లేకపోయినా కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అభిమానులు అల్లరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న ఒక షో ప్రమోషన్స్ లో భాగంగా ఆమె అందాలు ఆరబోస్తూ ఆసక్తి రేకెత్తిచింది. ఆ వివరాల్లోకి వెళితే

     చిన్ననాటి నుంచే

    చిన్ననాటి నుంచే

    బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే చిన్ననాటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. పలు మోడలింగ్ ఆఫర్స్ కూడా అందుకున్న ఈ భామ టైగర్ ష్రాఫ్ తారాసుతారియాలతో కలిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అదే ఏడాది పతి పత్ని ఔర్ ఓ అనే సినిమాలో కూడా నటించి ఆసక్తి రేకెత్తించింది. అర్జున్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ తో కలిసి ఆమె ఖాలీ పీలీ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది.

     లైగర్ సినిమాలో

    లైగర్ సినిమాలో

    ఆ తర్వాత ఏకంగా దీపికా పడుకొనేతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న ఈ భామ గహ్రియాన్ అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ప్రస్తుతానికి ఈ భామ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందుతున్న లైగర్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమె అటు బాలీవుడ్ నుంచి తెలుగు ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది.

    అందాలు ఆరబోసేందుకు

    ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా మీద ఆమె భారీ అంచనాలే పెట్టుకుంది. ఇక తాజాగా అసలు విషయానికి వస్తే ఆమె ఆమెజాన్ ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ చూసిందట. దానిని ప్రమోట్ చేస్తూ అందాలు ఆరబోసింది అనన్య పాండే. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ది సమ్మర్ ఐ టర్న్ ప్రెట్టి అనే ఒక వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. దాన్ని ఇతను స్నేహితురాళ్ళతో కలిసి చూసిన ఆమె షో గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే ఆసక్తికర విషయాలు పంచుకుంటూనే తన అందాలు ఆరబోసేందుకు అనన్య పాండే ఆసక్తి చూపించింది.

    సన్ ఫ్లవర్ పట్టుకొని

    సన్ ఫ్లవర్ పట్టుకొని

    ఒక సన్ ఫ్లవర్ పట్టుకొని ఎద అందాలు చూపిస్తూ ఆమె టీజ్ చేయడం మనకు ఫోటోలలో కనిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫోటోలన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియో షేర్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ భామ డేటింగ్ లో ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ కి సంబంధించిన ఒక హీరోతో ఆమె డేటింగ్ లో ఉందని అంటున్నారు.

    ఆదిత్య రాయ్ కపూర్ తో

    ఆదిత్య రాయ్ కపూర్ తో


    ఆదిత్య రాయ్ కపూర్ తో ఆమె ప్రేమలో పడిందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇషాన్ కట్టర్ తో చట్టా పట్టాలు ఏసుకుతిరిగిన ఈ భామ అతనికి బ్రేకప్ చెప్పి ఆదిత్య రాయ్ కపూర్ తో రిలేషన్ లోకి వెళ్లిందని ప్రచారం అయితే జరుగుతుంది.

    English summary
    Ananya Panday shares her hot photoshoot for amazon prime video, she binge watched an amazon original with her friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X