Ananya Panday స్లీవ్‌లెస్ జాకెట్‌లో మెరిసిన లైగర్ భామ.. వయ్యారంగా అలా గ్లామర్ ట్రీట్
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మంచి జోష్‌తో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నది. వరుస ఆఫర్లలను చేజిక్కించుకొంటూ ముందుకెళ్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో స్థిరపడేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నది. విభిన్నమైన చిత్రాలతో తన ప్రతిభను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. తాజాగా ఆమె నటించిన హిందీ చిత్రం గెహ్రాయియాన్ విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో హీరో సిద్దాంత్ చతుర్వేది, సహ నటి, బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్‌తో కలిసి పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రోమోషన్‌లో భాగంగా ఆమె ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ అనన్య వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..

అనన్య పాండే కెరీర్ విషయానికి వస్తే..
అనన్య పాండే తన కెరీర్‌ను స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే చిత్రంతో ప్రారంభించించింది. ఆ తర్వాత పతి, పత్ని ఔర్ ఓ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియం సినిమాలో కీలక పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. ఆ తర్వాత ఇషాన్ కట్టర్‌తో ఖాళీ పీళీ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రం ద్వారా దక్షిణాది సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

యువతీ, యువకుల రిలేషన్‌షిప్ నేపథ్యంగా
గెహ్రాయియాన్ చిత్రంలో దీపిక పదుకోన్, అనన్య పాండే, సిద్దార్థ్ చతుర్వేది, ధైర్య కర్వా లాంటి తారలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తుండగా, షకున్ బాత్రా దర్వకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో యువతీ, యువకుల మధ్య ప్రేమలు, సహజీవనం, అక్రమ బంధాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ మంచి అంచనాలు పెంచింది.

అనన్య పాండే గ్లామర్ ట్రీట్
కోవిడ్ పరిస్థితుల కారణంగా థియేటర్లు మూత పడటంతో గెహ్రాయియాన్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కొద్ది రోజుల వరకు ఈ సినిమా ప్రమోషన్స్‌ను వర్చువల్‌గా చేశారు. ముంబైలోను, దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ సందర్భంగా అనన్య పాండే, దీపిక పదుకోన్ హంగామా పీక్స్‌లో కనిపిస్తున్నది. జాతీయ మీడియాలో అనన్య పాండే, దీపిక పదుకోన్ గ్లామర్ హాట్ టాపిక్‌గా మారింది.

ప్రమోషన్‌లో అనన్య పాండే అందాలు
ఇక అనన్య పాండే గ్లామర్ విషయానికి వస్తే.. గెహ్రాయియాన్ ప్రోమోషన్స్‌లో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు టాప్ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆమె ధరించిన డ్రస్సులు యూత్‌ను మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాయి. డిజైనర్ దుస్తుల మాటున అందాల అరబోత హాట్ హాట్‌గా మారింది. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో అనన్య పాండే ఫోటోలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

మినీ టాప్‌లో అందాల ఆరబోత
ఇక గేహ్రాయియాన్ సినిమా ప్రమోషన్‌లో మంగళవారం అనన్య పాండే ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. ఎరుపు రంగు ప్యాంట్.. బ్లాక్ మినీ టాప్ ధరించిన ఆమె మరింత గ్లామరస్‌గా కనిపించింది. స్లీవ్‌లెస్ జాకెట్‌తో అభిమానులకు గ్లామర్ ట్రీట్‌ను పంచింది. అందంగా ఫోటోలకు ఫోజులిస్తూ హంగామా చేసింది. ప్రస్తుతం అనన్య పాండే అందచందాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్
ఇదిలా ఉంటే.. గెహ్రాయియాన్ చిత్రం ఫిబ్రవరి 11వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. లవ్, రొమాన్స్, అడల్ట్ కంటెంట్, ఎమోషన్స్ కలబోసిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. దాదాపు 240 దేశాల్లో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై యూత్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

గెహ్రాయియాన్‌లో తెర ముందు.. తెర వెనుక
నటీనటులు: దీపిక పదుకోన్, అనన్య పాండే, సిద్దార్థ్ చతుర్వేది, ధైర్య కర్వా, నసీరుద్దీన్ షా, రజత్ కపూర్ తదితరులు
కథ, దర్శకత్వం: షకున్ బాత్రా
నిర్మాతలు: హీరో యష్ జోహర్, కరణ్ జోమర్, అపూర్వ మెహతా, షకున్ బాత్రా
సినిమాటోగ్రఫి: కౌశల్ షా
ఎడిటింగ్: నితేష్ భాటియా
మ్యూజిక్: కబీర్ కథాపలియా, సవేరా మెహతా
బ్యానర్స్: ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్కా ఫిల్మ్స్
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2022-02-11


Click it and Unblock the Notifications











