Dabboo Ratnani ఫోటోషూట్ కోసం రెచ్చిపోయిన అనన్య.. చొక్కా బొత్తాలు విప్పేసి బ్రాతోనే!
అనన్య పాండే ఇప్పుడు యూత్ లో చాలా పాపులర్. బాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలోనే తెలుగులో కూడా విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఉండే ఈ భామ తాజాగా డబూ రత్నాని 2021 క్యాలెండర్ కోసం ఫోజిచ్చింది.. అయితే ఆ ఫోజు కాస్త హాట్ గా ఉండడంతో సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది.. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మొదటి సినిమాకే అవార్డులు
అనన్య పాండే అనేక హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు చంకీ పాండే కుమార్తె. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పతీ పత్నీ ఔర్ వో సినిమాలో కూడా నటించింది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే మొదటి సినిమాకి ఆమె ఉత్తమ నూతననటి ఫిలింఫేర్ అవార్డు, మరియు ఉత్తమ నూతననటి జీ సినీ అవార్డులు కూడా సాధించింది.

లాక్ డౌన్ ఇయర్ లో కూడా రెండు సినిమాలతో
2020లో యాక్షన్ మూవీ ఖాలీ పీలీలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించారు. ఈ సినిమా కూడా ఆమెను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది అని చెప్పవచ్చు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా జీ ఫ్లెక్స్ ద్వారా రిలీజ్ అయింది. అదే ఏడాది అంగ్రేజీ మీడియం అనే సినిమా ద్వారా కూడా అనన్య పాండే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది.

బడా హీరోయిన్స్ మాదిరే
ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ ఒకప్పుడు సౌత్ లో సినిమాలు చేసిన వాళ్లే కావడంతో పాటు ఆమెకు సౌత్ నుంచి ఒక బంపర్ ఆఫర్ తగలడంతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తోంది ఈ భామ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ అనే సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాథ్ కి సంబంధించిన పూరి కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

చొక్కా బొత్తాలు విప్పేసి
అయితే ఎప్పటికప్పుడు పొట్టి బట్టలు వేసుకుంటూ సోషల్ మీడియాలో తన అభిమానులను అలరిస్తూ ఉండే ఈ భామ తాజాగా డబూ రత్నాని 2021 క్యాలెండర్ కోసం హాట్ ఫోజులు ఇచ్చింది. తన కుక్క పిల్లను పక్కన కూర్చోబెట్టుకుని మరీ చొక్కా బొత్తాలు విప్పేసి సగం వరకు లాగేసి కేవలం బ్రాతో కనిపిస్తూ తన ఫాలోవర్స్ కి హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇక ఈ ఫోటో షూట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఆమెకు పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది.
Recommended Video

రెండు సినిమాలతో బిజీ
ఈ భామ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసమే కాక శకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఇంకా పేరు పెట్టని ఒక రొమాంటిక్ డ్రామాలో దీపికా పడుకొనే మరియు సిద్ధాంతి చతుర్వేదిలతో కలిసి నటిస్తోంది. పూరి జగన్నాథ్ సినిమా హిట్ అయితే ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.


Click it and Unblock the Notifications











