టాలీవుడ్‌కు మరో హాట్ హీరోయిన్.. మొదటి సినిమాలోనే బికినీతో లండన్ భామ
అందం, అభినయంతో ఆకట్టుకొనే హీరోయిన్లకు టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్. భాష, ప్రాంతం అనే భేదం లేకుండా పరభాష నటులను తెలుగు సినిమా అక్కున చేర్చుకొంటుంది. అలా ఎందరో హీరోయిన్లు తెలుగులో స్టార్ హీరోయిన్లుగా నిలదొక్కుకొన్నారు. తాజాగా అన్య సింగ్ అనే భామ టాలీవుడ్‌లో సెగలు రేపేందుకు రెడీ అయ్యింది. ఆమె ఎవరంటే

నిను వీడను నీడను నేను చిత్రంలో
అన్య సింగ్ త్వరలోనే నిను వీడని నీడను నేను అనే చిత్రంతో పరిచయం కాబోతున్నది. ఈ చిత్రంలో యువ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ సరసన నటించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం చర్చనీయాంశమైంది.

యష్ రాజ్ ఫిలింస్‌లో
అన్య సింగ్ తొలుత బాలీవుడ్ చిత్రంలో నటించింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన ఖైదీ బ్యాండ్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినప్పటికీ అనన్యకు మంచి పేరు వచ్చింది.

లండన్‌లో పుట్టి ఇండియాలో
అన్య సింగ్ లండన్‌లో జన్మించారు. ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులు ఢిల్లీకి మకాం మార్చారు. అజ్మీర్‌లోని మాయో గర్ల్స్ కాలేజీలో విద్యాభ్యాసం జరిగింది. బాల్యంలో పెద్దగా సినిమాలు కూడా చూడలేదని ఇటీవల చెప్పింది.

హీరో సందీప్ కిషన్‌తో
ఢిల్లీలోని శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకొన్న తర్వాత సినీ రంగంపై దృష్టిపెట్టింది. ఆ క్రమంలో యష్ రాజ్ ఫిలింస్ ఇచ్చిన ఆఫర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా టాలీవుడ్‌లో సందీప్ కిషన్ సరసన అవకాశం దక్కించుకొన్నది.


Click it and Unblock the Notifications











