Anasuya Bharadwaj: అందుకే పవన్ కళ్యాణ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశా.. క్లారిటీ ఇచ్చిన అనసూయ ..
Anasuya Bharadwaj: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కనిపిస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. అది అన్ స్క్రీన్ అయిన సరే , ఆఫ్ స్క్రీన్ అయినా క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం పవర్ స్టార్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. సమయంలో దొరికినప్పుడల్లా గతంలో ఒప్పుకున్న సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఆయనతో నటించడం ఎంతో అదృష్టమని భావిస్తారు. అయితే.. యాంకర్, నటి అనసూయ మాత్రం పవన్ కళ్యాణ్ ఆఫర్ రిజెక్ట్ చేశారట. పవన్ కళ్యాణ్ తో నటించి అవకాశాన్ని వదులుకోవడానికి గల కారణాలను తాజాగా వెల్లడించింది.
యాంకర్ కమ్ నటి అనసూయ.. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ తరువాత యాంకర్‌గా, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ అటు బుల్లి తెర, ఇటు వెండి తెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ అమ్మడు జీవితాన్ని జబర్థస్త్ కామెడీ షో మలుపుతిప్పింది . ఈ షో ద్వారా మంచి గుర్తింపు పొంది.. సిల్వర్ స్కీన్ పై అవకాశాలు అందుకుంది. అలా.. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. అలా.. బ్లాక్ బస్టర్ హిట్ థ్రిల్లర్ మూవీ 'క్షణం'లో ఏసీపీ జయ క్యారెక్టర్ అనసూయ కు బ్రేక్‌ని ఇచ్చింది.

ఆ తరువాత రామ్ చరణ్ ' రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ కు జీవం పోసింది అనసూయ. ఇక పుష్ప సినిమాలో నట విశ్వరూపాన్ని చూపించింది. ఇటీవల వచ్చిన పుష్ప 2 సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటించి, మెప్పించింది. ఇటీవల హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి స్టెప్పులు వేసింది. మెగా ఫ్యామిలీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఇదెలా ఉంటే.. అనసూయ తాజాగా ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ తన పర్సనల్, అండ్ ప్రొఫెషనల్ కెరీర్ లోని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో గతంలో పవన్ కళ్యాన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్పెప్పులేసే అవకాశమొస్తే..ఎందుకు రిజెక్ట్ చేశానో చెప్పింది.
ఆ సినిమా ఏదో కాదు.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది మూవీలోని స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం అనసూయకు వచ్చింది. కానీ అప్పుడు తాను గ్రూప్ గా చేయలేననీ, కావాలంటే సింగల్ గా చేస్తానంటూ రిజెక్ట్ చేసింది. దీంతో విషయం అప్పట్లో పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఇటీవల అదే పవన్ కళ్యాణ్ తో స్టెప్పులేసే అవకాశం కొట్టేసింది అనసూయ. అదికూడా హరి హర వీరమల్లు సినిమాలో .. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి మాస్ స్టెప్పులేసిందట.
ఓ ఇంటర్య్యూలో అనసూయ మాట్లాడూతూ.. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలోని పబ్ సాంగ్‌ను రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. అప్పుట్లో ఆ పాటను రిజెక్ట్ చేయడం, ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ తో స్టెప్పులేయడానికి వెనుకున్న కారణాలు చెప్పేసింది. ' అప్పటి తన మైండ్ సెట్ వేరు ఉండేదనీ, అప్పట్లో తనకు కొన్ని విషయాలు సులభంగా అర్థమయ్యేవి కావనీ, అప్పుడు ఆ టైంకి తాను తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అనిపించేందని, వేరే వాళ్ల చెప్పినా తాను పట్టించేకునే దాన్ని కాదని పేర్కొంది అనసూయ.
ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలోని పబ్ సాంగ్‌కు నో చెప్పాననీ, అంతే తప్పా మరేతర కారణం లేదన్నారు. నాటికి నేటీకి చాలా విషయాలు మారాయనీ, ఇప్పుడు మైండ్ సెట్ పూర్తి మారిందని, ఎంతో మార్పు వచ్చిందంటూ అనసూయ పేర్కొన్నారు.

అలాగే.. హరివీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన అనుభవం గురించి చెబుతూ.. 'పాట చాలా బాగా ఉంటుంది. చాలా క్యాచీగా ఉంటుంది, బాగా నటించింది 'అని అనసూయ చెప్పుకొచ్చింది. షూటింగ్ లో టైం దొరికితే చాలు పవన్ కళ్యాణ్ బుక్స్ పట్టుకుని చదువుతూనే కనిపించేవారనీ, ఆ టైంలో పార్టీ మీటింగ్స్ అంటూ హడావిడి కూడా కనిపించే వారని పేర్కొంది. తనకు పవన్ లో చిన్న పిల్లాడి మనస్తత్వం కనిపించిందని అనసూయ తెలిపింది. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు.. ఇలా అన్ని పనులు ఒకేసారి ఎలా చేస్తారా? అని ఆశ్చర్యం కలుగుతుందని అనసూయ చెప్పుకొచ్చింది.
పవన్ కళ్యాణ్ కు ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్నా.. చాలా హంబుల్‌గా ఉంటారనీ, ఆయన ఎంతో మందికి స్పూర్తిలా నిలుస్తారని అనసూయ పొగత్తలతో ముంచేత్తింది. ఎన్నో త్యాగాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. కాబట్టే.. పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని పేర్కొన్నారు. అలాగే.. మెగా బ్రదర్స్ అంతా కూడా చాలా మంచి వారు.. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే మనసత్వం అని పేర్కొన్నారు. ఫైనల్ గా తనకు మెగా కాంపౌండ్ నటి అని ముద్రపడిందనీ, అందరితో కలిసి చేశాను.. ఇంకా వైష్ణవ్ తేజ్‌తో నటించాల్సి ఉందని అనసూయ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











