వారంలో ఒకసారైనా విడాకులు తీసుకొందామని అనుకొంటాం.. భర్తతో గొడవలపై అనసూయ

టెలివిజన్ రంగంలో తనదైన మార్కుతో అంద్నీ ఆకట్టుకొంటున్న అనసూయ సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకొంటూ ముందుకెళ్తున్నారు. ఎవరేమనుకొంటారో అనే విషయాన్ని పక్కన పెట్టి తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో తనకు నచ్చకపోతే ముక్కుసూటిగా వారిని రఫ్ ఆడిస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌కు ధీటుగా జవాబిస్తుంటుంది. తాజాగా లాక్‌డౌన్‌లో బర్త్ డే జరుపుకొని సామాజిక సేవలో భాగమైన అనసూయ తాజాగా లైవ్‌ ఛాట్‌లో మాట్లాడుతూ..

నాకు అలా ప్రపోజ్ చేశారు..

నాకు అలా ప్రపోజ్ చేశారు..

శశాంక్‌తో నా ప్రేమ ఎన్సీసీ క్యాంపులో మొదలైంది. క్యాంపులో నాకు ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోలేదు. ఆ సమయంలో నాకు ప్రేమ, అఫైర్స్ లాంటి వాటిపై నమ్మకం లేదు. నా తల్లిదండ్రుల నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లనని చెప్పనని అన్నాను. అందుకే మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అతడితో ఫ్రెండ్ షిప్ కొనసాగింది. పేజర్స్ ద్వారా మేము కనెక్ట్ అయ్యేవాళ్లం. నాతో అలా ఆయన టచ్‌లో ఉన్నాడు అని అనసూయ తెలిపింది.

ప్రేమ విషయం చెబితే ఇంట్లో నుంచి తరిమేశారు..

ప్రేమ విషయం చెబితే ఇంట్లో నుంచి తరిమేశారు..


అలా శశాంక్‌తో పరిచయం కొనసాగుతూ ప్రేమలో మునిగిపోయాం. నాకోసం చాలా కేర్ తీసుకొనే వాడు. ఇంట్లో చెబితే ఒప్పుకోలేకపోవడంతో బయటకు వచ్చాం. నేను ఎంబీఏ చదవడానికి ఆయన డబ్బు ఖర్చుపెట్టారు. ఫారిన్ నుంచి తన అన్నయ్య పంపిన మొబైల్ ఫోన్‌ అమ్మి ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ఫీజ్ కట్టారు. ఎంబీఏకు కావాల్సిన ఫీజులన్నీ ఆయనే కట్టారు. ఏడాది తర్వాత జాబ్ చేసుకొంటూ ఎంబీఏ పూర్తి చేశాను అనసూయ అన్నారు.

పెళ్లికి పెద్దలు అలా ఒప్పుకొని

పెళ్లికి పెద్దలు అలా ఒప్పుకొని

ఇక పెళ్లి చేసుకోవాలనుకొన్నప్పుడు ఇంట్లో ఒప్పుకోలేదు. చాలాసార్లు మనమే పెళ్లి చేసుకొందామని ఫోర్స్ చేశాను. కానీ అలాంటి పెళ్లికి గౌరవం ఉండదని చెప్పాడు. చివరకు నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకొన్నాం. ఇప్పుడు జూన్ 5వ తేదీకి మా పెళ్లి జరిగి పదేళ్లు పూర్తి అవుతుంది. అప్పుడే మా దాంపత్య జీవితానికి పదేళ్లా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటే ఎలాంటి వాటికైనా సిద్ధమవుతాం. అని అనసూయ చెప్పారు.

నా భర్త జోక్యం చేసుకోరు

నా భర్త జోక్యం చేసుకోరు

నా కెరీర్ విషయంలో నా భర్త జోక్యం చేసుకోరు. నేను చాలా విషయాలపై సలహా తీసుకొంటాను. ఆయన వెంబడి పడి సలహాలు ఇవ్వమని అడిగితే నీకు ఏది ఇష్టమైతే అది చేయి. నీ కెరీర్ గురించి నీకు ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేయి. ఇక ఆయన అంటే ఎందుకు ప్రేమ అంటే మాటల్లో చెప్పలేను. అదొక ఫీలింగ్ మాత్రమే అని అనసూయ చెప్పారు.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
మూడో వ్యక్తి కారణంగా గొడవలు

మూడో వ్యక్తి కారణంగా గొడవలు

ఇక అందరి ఇంట్లో మాదిరిగానే మా మధ్య కలహాలు, కలతలు ఉంటాయి. వారానికి ఓ సారి మేము ఏదో విషయం మీద గొడవ పడుతుంటాం. మా మధ్య మూడో వ్యక్తి కారణంగా గొడవలు అవుతుంటాయి. మాలో ఒకరి గురించి మరొకరికి గొడవలు ఉండవు. మన మధ్య ప్రేమ ఉన్నప్పుడు... మన ఇద్దరం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు గొడవలు ఎందుకు అనుకొంటాం. కానీ రెండు హృదయాలు, రెండు మనసులు ఒక్క చోటు ఉంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. వారం రోజుల్లో ఒకసారి డైవోర్స్ తీసుకొందామని గొడవ పడుతాం అని అనసూయ తమ రిలేషన్ గురించి వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X