For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫిజిక్ విషయంలో అనసూయ డేరింగ్ స్టెప్: విమానం ఎక్కేందుకు రిస్క్.. దీని వెనుక అసలు కథ తెలిస్తే!

  |

  అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బ్యూటీ దాదాపు పదేళ్లుగా అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. అదే సమయంలో వరస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా రెండు రంగాల్లోనూ హవాను చూపిస్తోంది. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనసూయ భరద్వాజ్.. త్వరలోనే ఓ భారీ సాహసం చేయబోతుందని తెలుస్తోంది. ఇలా చేయడం ఆమె కెరీర్‌లో ఇదే మొదటిసారి. ఇంతకీ ఏం చేస్తుందామె? పూర్తి వివరాలు మీకోసం!

  అనసూయ కెరీర్ జబర్ధస్త్‌‌గా

  అనసూయ కెరీర్ జబర్ధస్త్‌‌గా

  అప్పుడెప్పుడో సినిమాలో తళుక్కున మెరిసి.. సుదీర్ఘ విరామం తర్వాత జబర్ధస్త్ షో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది అనసూయ భరద్వాజ్. అప్పటి నుంచి తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తున్న ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా కెరీర్‌ను జబర్ధస్త్‌గా సాగిస్తూ దూసుకుపోతోంది.

  విష్ణుప్రియపై ఆది సంచలన వ్యాఖ్యలు: ఆమె లవ్ ట్రాకును లాగుతూ.. అతడి పేరును వాడేశాడుగా!

  అక్కడ కూడా సత్తా చాటింది

  అక్కడ కూడా సత్తా చాటింది

  చాలా కాలం పాటు బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటిన అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తనదైన శైలి యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. ఈ క్రమంలోనే కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇలా వెండితెరపైనా హవాను చూపిస్తోంది.

   అన్నింట్లోనూ అనసూయనే

  అన్నింట్లోనూ అనసూయనే

  గతంలో ఎక్కువగా టీవీ షోల మీద ఫోకస్ చేసిన అనసూయ.. ఇప్పుడు మాత్రం సినిమాలనే చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ‘థ్యాంక్యూ బ్రదర్'తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. అలాగే, ‘రంగమార్తాండ'లోనూ నటించింది. వీటితో పాటు ‘వేదాంతం రాఘవయ్య', ‘ఖిలాడీ', ‘హరిహర వీరమల్లు', ‘పుష్ప' వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది.

   మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్

  మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్

  ఇప్పటికే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ‘పేపర్ బాయ్' దర్శకుడు జయశంకర్ తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది.

   అనసూయ భారీ సాహసంతో

  అనసూయ భారీ సాహసంతో

  జయశంకర్ తెరకెక్కించే ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ ఎయిర్ హోస్టెస్‌గా నటిస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం ఆమె ఎంతో రిస్క్ చేయబోతుందట. ముందుగా సరైన లుక్ కోసం బరువు తగ్గాలని నిర్ణయించుకుందని తెలిసింది. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేయనుందట. ఇందులో కూడా శిక్షణ తీసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది.

  మరోసారి పేరు మార్చుకున్న సమంత: పెళ్లి తర్వాత అలా ఇప్పుడు ఇలా.. అక్కినేని కోడలిపై అనుమానాలు

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  దీని వెనుక అసలు కథ ఇదే

  దీని వెనుక అసలు కథ ఇదే

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఆరుగురి కథలతో సమాంతరంగా సాగబోతుందట. ఇందులో ఓ పాత్రను అనసూయ చేస్తుందని.. ఆమెనే ఎక్కువగా హైలైట్ చేయబోతున్నారని తెలుస్తోంది. మిగిలిన పాత్రలకు కూడా నటీనటుల ఎంపిక జరిగిన తర్వాత ప్రకటన చేస్తారట. ఇక, ఈ మూవీలో అనసూయ విమానంలోని ప్రయాణికులను కాపాడుతుందనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Anchor Anasuya Bharadwaj Now Doing So Many Movies At a Time. Now She Green Signal to Paper Director Jayashankar. In This Movie She will Do Air Hostess Role
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X