అందరి ముందే ఊహించని పని చేసిన పవన్ ఫ్యాన్: ఆ సంఘటనపై అనసూయ ఆగ్రహం.. చూస్తూ ఊరుకుంటారా అంటూ!

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా 'వకీల్ సాబ్' మేనియా కనిపిస్తోంది. దీనికి కారణం మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే. దీంతో ఆయన అభిమానులంతా తెగ హడావిడి చేస్తున్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఈ సినిమా ఆడే థియేటర్లను సుందరగంగా రెడీ చేశారు. అంతేకాదు, ఆట పాటలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఫ్యాన్ అందరి ముందే ఊహించని పని చేశాడు. దీనిపై యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్


మూడేళ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్ నటించిన చిత్రమే 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. బాలీవుడ్ మూవీ 'పింక్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ముందు నుంచే హంగామా.. జాతరలా రిలీజ్

ముందు నుంచే హంగామా.. జాతరలా రిలీజ్

సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్ సినిమా విడుదల అయింది. దీంతో ముందు నుంచే ఆయన అభిమానుల సందడి మొదలైపోయింది. ఇందులో భాగంగానే 'వకీల్ సాబ్' విడుదలయ్యే థియేటర్లను బాగా రెడీ చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లు, క్షీరాభిషేకాలు, కొబ్బరి కాయలు కొట్టడం వంటివి చేస్తూ తమ అభిమానాన్ని చాటారు. దీంతో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలయింది.

అదిరిపోయిన రెస్పాన్స్.. మొదటి రోజే భారీగా

అదిరిపోయిన రెస్పాన్స్.. మొదటి రోజే భారీగా

'వకీల్ సాబ్' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు. టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లనూ సాధించిందీ చిత్రం. ఫస్ట్ డే ఏకంగా రూ. 40 కోట్లు వరకూ వసూలు చేసిన ఈ మూవీ.. ఒక్కరోజులోనే దాదాపు 40 శాతం రికవరీ చేసింది. అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది.

స్క్రీన్ దగ్గరకు వెళ్లి చేయి కోసుకున్న ఫ్యాన్

స్క్రీన్ దగ్గరకు వెళ్లి చేయి కోసుకున్న ఫ్యాన్

అభిమానులందరిలోనూ పవన్ కల్యాణ్ అభిమానులు వేరు. అంతలా వాళ్లు తరచూ ఏదో ఒక విషయంలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఇక, వకీల్ సాబ్ రిలీజ్ సందర్భంగా ఓ అభిమాని తన చేతిని కోసుకుని.. థియేటర్ స్క్రిన్‌పై PSPK అని రక్తంతో రాశాడు. ఒళ్లు గగుర్పొడిచేలా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన వారంతా అతడిని తిడుతున్నారు.

 వీడియోపై స్పందించిన యాంకర్ అనసూయ

వీడియోపై స్పందించిన యాంకర్ అనసూయ

పవన్ కల్యాణ్ అభిమాని థియేటర్‌లో చేయి కోసుకోవడంతో.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో దీనిపై ఎంతో మంది స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా తన హవాను చూపిస్తోన్న హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ కూడా రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ సెల్ఫీ వీడియోను స్టోరీగా పెట్టుకుందామె.

Recommended Video

Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
ఎదుటివాళ్లు ఎలా చూస్తూ ఊరుకున్నారంటూ

ఎదుటివాళ్లు ఎలా చూస్తూ ఊరుకున్నారంటూ

ఈ ఘటనపై స్పందిస్తూ.. 'అభిమానాన్ని చాటుకోవడానికి ఎన్నో రకాల దారులున్నాయి. మీరంతా కొంచెం బాధ్యతాయుతంగా నడుచుకుంటే అందరికీ బాగుంటుంది. ఇలాంటి పనులు చేసే సమయంలో ఎదుటి వాళ్లు ఎలా చూస్తూ ఊరుకున్నారు. ఇలాంటి పనుల వల్ల మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి కూడా ఆలోచించారా' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X