సావిత్రిగా అనసూయ, ఆ వీడియో చూసి నెటిజన్ల ట్రోలింగ్... నవ్వుకోవడం ఖాయం!

Recommended Video

Anchor Anasuya Trolled For Imitating Mahanati Savitri : Video Viral | Filmibeat Telugu

యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను మహానటి సావిత్రి పోషించిన పాత్రలో ఊహించగలమా? సావిత్రి నటించిన సూపర్ హిట్ మూవీ మాయాబజార్‌లోని అహనా పెళ్లంట పాటలో ఈ యాంకర్ నటిస్తే ఎలా ఉంటుంది? ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు?.... అందుకు సమాధానం దొరికింది.

అనసూయ తాజాగా ఓ కమర్షియల్ యాడ్లో నటించింది. మాయాజబార్ మూవీలోని 'అహనా పెళ్లంట' థీమ్‌తో ఈ యాడ్ డిజైన్ చేశారు. సావిత్రి తరహాలో అనసూయ డాస్స్ చేస్తూ, ఆవిడలా హావ భావాలు పలికించే ప్రయత్నం చేసింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.

సావిత్రమ్మగా నటించడం నా అదృష్టం

ఈ కమర్షియల్ యాడ్ వీడియో షేర్ చేసిన అనసూయ... సావిత్రమ్మ పాత్రలో నటించడం తన అదృష్టం అని తెలిపారు. ఇలాంటి పాత్రలో నటించే అవకావం చాలా అరుదుగా లభిస్తుందని వెల్లడించారు.

వెన్నెల కిషోర్ రియాక్షన్

అనసూయ వీడియోపై ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ రియాక్ట్ అవుతూ... చాలా బాగా నటించారు అంటూ ప్రశంసలు గుప్పించారు.

ఫ్యాన్స్ ఫన్నీ రియాక్షన్స్

అయితే ఈ వీడియోపై అభిమానుల నుంచి ఫన్నీ రియాక్షన్స్ వ్యక్తం అయ్యాయి. అభిమానులు సరదాగా చేస్తున్న ఈ ట్రోలింగ్ నవ్వులు పూయిస్తోంది.

ఎక్స్‌పెక్ట్ చేయలేదు

అనసూయను ఇలాంటి పాత్రలో చూడాల్సి వస్తుందని బహుషా అభిమానులు కూడా ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. అందుకే వింతగా తమ ఎక్స్‌ప్రెషన్స్ వ్యక్తం చేస్తున్నారు.

ఈ రిప్లై సూపర్

మెగాస్టార్ చిరంజీవి జిఫ్ ఇమేజ్‌తో పోస్ట్ చేసిన ఓ కామెంట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనసూయను సావిత్రి పాత్రలో చూసి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో...

ఇది ఇంకా కేక..

మరికొందరు బాలయ్య జిఫ్ ఇమేజ్‌తో కేక పెట్టించే రియాక్షన్స్ ఇవ్వడం గమనార్హం. మొత్తానికి అనసూయ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్న తీరు నవ్వులు పూయిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X