HBD Anasuya Bharadwaj బోల్డ్‌గా అనసూయ భరద్వాజ్.. వయ్యారాల ఒలకబోస్తూ సుమతిగా!
యాంకర్ నుంచి యాక్టర్‌గా మారిన అనసూయ భరద్వాజ్.. ఐటెమ్, స్పెషల్ సాంగ్స్‌తో తన కంటూ బోల్డ్ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు. అయితే రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా రాణించిన తర్వాత పెర్ఫార్మెన్స్ ప్రాధాన్యం ఉన్న బోల్డ్ పాత్రలతో ఆకట్టుకొంటున్నారు.
పుష్పతో విలనిజం టచ్‌తో కొత్తగా కనిపించారు. ఆ తర్వాత ఉమెన్ ఓరియెంట్ పాత్రలతో నటించినప్పటికీ అనసూయ భరద్వాజ్ పెద్దగా తన మ్కార్ చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ పుట్టిన రోజు సందర్భంగా బోల్డ్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ పాత్రకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అడల్డ్ కామెడీ షోకు హోస్ట్‌గా: టెలివిజన్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా అవతారమెత్తిన అనసూయ.. ఆ తర్వాత సినిమా ఈవెంట్లకు హోస్ట్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత జబర్దస్త్ లాంటి అడల్డ్ కామెడీ షోకు హోస్ట్‌గా మెప్పించింది. ఆ తర్వాత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, బోల్డ్ పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నది.

విమానం మూవీలోని సుమతి పాత్రలో: అనసూయ భరద్వాజ్ మే 15వ తేదీన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె బర్త్ డేను పురస్కరించుకొని విమానం మూవీలోని సుమతి పాత్రలో అనసూయను పరిచయం చేశారు. విమానం సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.

గ్లింప్స్ వీడియోలో బోల్డ్ లుక్‌తో: విమానం సినిమా గ్లింప్స్ వీడియోలో బోల్డ్ లుక్‌తో అభిమానులకు అందాల విందును ప్రదర్శించింది. సుమతి పాత్రలో కనిపించిన ఆమె అందంగా ముస్తాబవుతూ గ్లామర్ ట్రీట్ పంచింది. వీపు భాగాన్ని చూపుతూ పెదవులు, కంటి రెప్పలను అందంగా అలకరించుకొంటూ కనిపించింది. ఆమె ఎవరి కోసం? ఎందుకు రెడీ అవుతుందనే విషయం గ్లింప్స్‌ను ఆసక్తిని క్రియేట్ చేసింది.
గ్లామర్‌కు ఫెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం: అంగవైకల్యంతో బాధపడే తండ్రి, కొడుకుల కథ విమానం. వీరయ్య పాత్రలో సముద్రఖని.. కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తున్నారు. గ్లామర్‌కు ఫెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలో అనసూయ భరద్వాజ్, ఇతర పాత్రల్లో ధనరాజ్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్రన్ నటిస్తున్నారు. జూన్ 9న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం గ్లింప్స్ మరింత అంచనాలు పెంచింది.

విమానం మూవీలో: నటీనటులు: సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ తదితరులు
ప్రొడ్యూసర్స్: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్)
రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల
సినిమాటోగ్రఫి: వివేక్ కాలేపు
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
మ్యూజిక్: చరణ్ అర్జున్
ఆర్ట్: జె.జె.మూర్తి
డైలాగ్స్: హను రావూరి (తెలుగు), ప్రభాకర్ (తమిళం)
లిరిక్స్: స్నేహన్(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)
పీఆర్వో: నాయుడు - ఫణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువరాజ్ (తమిళ్)
డిజిటల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా


Click it and Unblock the Notifications











