అనసూయ జీవితాన్నే మార్చేయబోతున్న సినిమా.. ఆ పాత్ర మరొకరు చేయలేరట!

జబర్దస్త్ షోతో పాటు ఎప్పటికప్పుడు డిఫరెంట్ షోలతో ఆకట్టుకునే అనసూయా భరద్వాజ్ ఎలాంటి షో చేసినా బుల్లితెరపై హిట్టవ్వాల్సిందే. ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది హాట్ టివి యాంకర్స్ లో అనసూయ టాప్ ప్లేస్ లో ఉందనే చెప్పాలి. ఇక రియాలిటీ షోలలో ముఖ్యంగా రంగమ్మత్త తన మార్క్ గ్లామర్ షోతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇక మెల్లగా వెండితెరపై తన క్రేజ్ పెంచుకుంటున్న అనసూయా కెరీర్ లో గుర్తిండిపోయే ఒక ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతోందట.

టాలీవుడ్ రంగమ్మత్తగా అనసూయ తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న రంగామార్తాండ సినిమాలో అమ్మడు అంతకు మించిన నటనతో ఎట్రాక్ట్ చేయనుందట. రంగస్థలం సినిమాలో మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా కనిపించి అనసూయ ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలో క్లాస్ ఆడియెన్స్ శభాష్ అనేలా దేవదాసిగా దర్శనమివ్వబోతోంది. ఆ పాత్ర మరొకరు చేయలేరట. గుడిలో వచ్చే కొన్ని సీన్స్ లలో అనసూయ అద్భుతమైన నటనతో ఆడియెన్స్ కి సరికొత్త కిక్కివ్వనుందట.

Anasuya bharadwaj career u turn role in ranga marthanda movie

బయట ఎక్కడా కనిపించినా కూడా అభిమానులు ఆమెను ఎక్కువగా రంగమ్మత్త అంటూ స్వీట్ గా పిలవడం స్టార్ట్ చేశారు. ఇక రంగామార్తాండ చూసిన తరువాత అంతకు మించిన క్రేజ్ ఆ పాత్రతో అందుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. చిత్ర యూనిట్ అనసూయ పాత్ర కోసం వేసిన స్పెషల్ సెట్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. మరాఠీ సినిమా నటసామ్రాట్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X