గ్లామర్ షోపై అనసూయ షాకింగ్ కామెంట్స్: అవి చూసి నా కొడుకు ప్రశ్నించాడు.. ఆ మాట అనగానే షాకయ్యా!

అనసూయ భరద్వాజ్.. రెండు రాష్ట్రాల్లోని ప్రజలకే కాదు.. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా దాదాపు ఏడేళ్లుగా బుల్లితెరపై తన హవాను చూపిస్తూ దూసుకుపోతోందామె. టెలివిజన్ రంగంలోనే కాదు.. వరుస సినిమాలు చేస్తూ వెండితెరపైనా సత్తా చాటుతోంది. ఇక, కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్ విషయాలతో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్లామర్ షోపై అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు, తన కొడుకుతో జరిగిన వింత అనుభవం గురించి చెప్పింది. ఆ సంగతులు మీకోసం!

నవ్వుతూనే గుండెల్ని పిండేస్తున్న షీలా రాజ్

అనసూయ కెరీర్ మొదలైంది అలా

అనసూయ కెరీర్ మొదలైంది అలా

చదువు పూర్తయిన వెంటనే సినిమాల్లో నటించాలని డిసైడ్ అయింది అనసూయ. ఇందుకోసం ఉద్యోగాలు చేస్తూనే ఎంతో కాలం పాటు వేచి చూసింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాగ' అనే సినిమాలో చిన్న పాత్రను పోషించడం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో చాలా కాలం ప్రజెంటర్‌గా పని చేసింది.

చిరుత పిల్ల నేహా శర్మ అందాల బికినీ షో

జబర్ధస్త్‌లోకి రావడంతో మారిందిగా

జబర్ధస్త్‌లోకి రావడంతో మారిందిగా

'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా అనసూయ భరద్వాజ్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతగానో మెప్పించిన ఆమె.. తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాదు, భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ సక్సెస్‌ఫుల్ యాంకర్‌గా మారింది.

ఐషా శర్మ.. క్లివేజ్ షో రచ్చ మాములుగా లేదు

సినిమాల్లోకి ఎంట్రీ.. సూపర్ సక్సెస్

సినిమాల్లోకి ఎంట్రీ.. సూపర్ సక్సెస్

బుల్లితెరపై తనదైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న అనసూయ.. అక్కినేని నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో వెండితెరపైకి అడుగులు వేసింది. ఇందులో కనిపించింది కాసేపే అయినా బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందీ బ్యూటీ.

పాయల్ రాజ్ పుత్.. Rx100 కంటే హై రేంజ్ గ్లామర్

ఫుల్ బిజీగా అనసూయ... వాటిలో

ఫుల్ బిజీగా అనసూయ... వాటిలో

ప్రస్తుతం అనసూయ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ', 'థ్యాంక్యూ బ్రదర్'లో నటిస్తోంది. అలాగే సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. వీటితో పాటు పవన్ - క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న 'హరిహర వీరమల్లు' అనే సినిమాలోనూ నటిస్తోందీ అమ్మడు.

360 డిగ్రీస్ లో అందాలను అరబోసిన అక్ష పర్దాసాని

ఇద్దరు పిల్లల తల్లైనా.. అందంతోనే

ఇద్దరు పిల్లల తల్లైనా.. అందంతోనే

అనసూయ ఇండస్ట్రీలోకి రాకముందే శశాంక్ భరద్వాజ్‌ను వివాహం చేసుకుంది. అంతేకాదు, ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాతనే కెరీర్‌ను ఆరంభించింది. ఏజ్ బారైనా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తరచూ పొట్టి బట్టలు ధరించి కనిపిస్తుంది. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. తద్వారా ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొంటోంది.

ప్రియాంక చోప్రా.. ఇంతకంటే హాట్ షో మరొకటి ఉండదేమో

గ్లామర్ షోపై అనసూయ కామెంట్స్

గ్లామర్ షోపై అనసూయ కామెంట్స్

తాజాగా అనసూయ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా గ్లామర్ షో చేయడం గురించి మాట్లాడింది. 'నేను ఎటువంటి బట్టలు వేసుకోవాలి అనేది నా వ్యక్తిగతం. డిగ్రీ వరకూ మా అమ్మ చెప్పిన బట్టలనే వేసుకున్నా. ఇప్పుడు మాత్రం నా ఇష్టం వచ్చినవే ధరిస్తున్నా. దీనిని గ్లామర్ షో అంటారో.. ఇంకోటో నాకు తెలీదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిందీ హాట్ యాంకర్.

అవి చూసి నా కొడుకు ప్రశ్నించాడు

అవి చూసి నా కొడుకు ప్రశ్నించాడు

ఇదే ఇంటర్వ్యూలో.. 'నేను పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు నా కొడుకు.. ''నువ్వు అలాంటివి వేసుకుంటే నాకు నచ్చట్లేదు'' అన్నాడు. ఆ మాటకు షాకైపోయా. అప్పుడు నాకు ఇవే కంఫర్టుగా ఉంటాయి. అందుకే వేసుకుంటున్నా అని చెప్పా. నువ్వు నీకు నచ్చిన బట్టలు వేసుకున్నట్లే.. నేను కూడా నాకు నచ్చినవి ధరిస్తా అనడంతో వాడు రియలైజ్ అయ్యాడు' అని చెప్పింది అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X