అనసూయను అనకూడని మాట అనేసిన నెటిజన్: అలా చేయడం వల్లే చెడ్డ పేరు వచ్చిందంటూ ఘాటు రిప్లై!

అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఈ బ్యూటీ పాపులారిటీని సంపాదించుకుంది. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ అమ్మడు.. బుల్లితెరపై చెరగని ముద్రను వేసుకుంది. అలాగే, వెండితెరపైకీ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటింది. తద్వారా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ అనసూయను అనకూడని మాట అనడంతో ఈ యాంకరమ్మ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Anchor Anasuya strong punch to a Netizen | Filmibeat Telugu
జబర్ధస్త్‌తో పాపులర్... వరుస ఆఫర్లతో బిజీ

జబర్ధస్త్‌తో పాపులర్... వరుస ఆఫర్లతో బిజీ

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను ఆరంభించింది హాట్ బ్యూటీ అనసూయ. ఎప్పుడైతే జబర్ధస్త్ షోలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఆమె కెరీర్ మారిపోయింది. అందులో ఆమె హోస్టింగ్‌కు.. కనిపించిన తీరుకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారిపోయిందామె. తద్వారా ఎన్నో ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇక్కడ మాత్రమే కాదు.. అక్కడా అదరగొట్టి

ఇక్కడ మాత్రమే కాదు.. అక్కడా అదరగొట్టి

బుల్లితెరపై వరుస షోలు చేస్తూ తన హవాను చూపిస్తోన్న అనసూయ.. 'సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నటనతో ఆకట్టుకుంది. అన్నింటిలో రంగమ్మత్త పాత్రకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక, ప్రతి ప్రాజెక్టులో దర్శక నిర్మాతల మొదటి చాయిస్ అవుతోంది.

అనసూయదే హవా.. ఎక్కడ చూసినా ఆమె

అనసూయదే హవా.. ఎక్కడ చూసినా ఆమె

జబర్ధస్త్‌తో పాటు కొన్ని షోలను హోస్ట్ చేస్తున్న అనసూయ భరద్వాజ్.. కొన్ని సినిమాల్లోనూ భాగం అయింది. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ'లో నటిస్తోందామె. దీనితో పాటు సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. అలాగే, పవన్ - క్రిష్ సినిమాలోనూ నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

ఆ సినిమాలో స్పెషల్ సాంగ్... పైన పటారం

ఆ సినిమాలో స్పెషల్ సాంగ్... పైన పటారం

కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బన్నీవాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల చేయనున్నారు. ఇక, ఇందులో అనసూయ భరద్వాజ్ 'పైన పటారం.. లోన లొటారం' అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్‌ను చేసిన విషయం తెలిసిందే.

అనసూయను అనకూడని మాట అనడంతో

అనసూయను అనకూడని మాట అనడంతో


అనసూయ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో ఆమె వేసిన స్టెప్పులు, లిరిక్స్ హైలైట్ అవుతున్నాయి. దీంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు థ్యాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ కూడా చేసిందామె. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఈ పాటను షేర్ చేస్తూ.. 'ఐటం సాంగ్స్ చేయను అన్నారు కదా.. మరి ఇది ఏంటి? అయినా ఆ లిరిక్స్ ఏంటండి' అంటూ అనసూయను ప్రశ్నించాడు.

అలా చేయడం వల్లే చెడ్డ పేరు వచ్చిందంటూ

అలా చేయడం వల్లే చెడ్డ పేరు వచ్చిందంటూ


నెటిజన్ చేసిన ట్వీట్‌ను చూసి అనసూయ 'హలో.. అది 'ఐటమ్' సాంగ్ కాదు.. అసలు 'ఐటమ్' సాంగ్ అనేది ఏది లేదమ్మా. ఒక పాటకి స్పెషల్‌గా ఎవరన్నా కావాలి అనుకున్నప్పుడు 'స్పెషల్' సాంగ్ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసేవాళ్లు ఇచ్చిన పేరు అది. ఇంకో విషయం, ఆ లిరిక్స్ వల్లే నేను ఈ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నాను' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

అది నా ఇష్టంపై ఆధారపడి ఉంటుందంటూ

అది నా ఇష్టంపై ఆధారపడి ఉంటుందంటూ


అలాగే, 'నేనెప్పుడూ స్పెషల్ సాంగ్స్ చేయను అని చెప్పలేదు. నా గురించి ఏదైనా తెలియాలంటే సోషల్ మీడియా ద్వారా నేరుగా ప్రశ్నించవచ్చు. గాసిప్పులను గుడ్డిగా నమ్మొద్దు. నా కెరీర్ నా నమ్మకాల మీద, నేను ఎంపిక చేసుకునే వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరో రాసిన దాని మీదో, టైప్ చేసిన దాని మీదో ఆధారపడి ఉండదు' అంటూ క్లారిటీ ఇచ్చింది అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X