For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మాయిల ప్రధాన సమస్యపై అనసూయ కామెంట్స్: కనిపిస్తే ఆ పని చేయొద్దు.. నాకూ అలాగే జరుగుతుందంటూ!

  |

  దాదాపు ఏడెనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. హోస్టుగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది. ఇక, తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో అమ్మాయిల ప్రధాన సమస్యపై మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే కొన్ని సలహాలు ఇచ్చింది. ఆ సంగతులు మీకోసం!

   జబర్ధస్త్‌గా సాగుతోన్న అనసూయ కెరీర్

  జబర్ధస్త్‌గా సాగుతోన్న అనసూయ కెరీర్

  చదువు.. పెళ్లి.. పిల్లలు ఇలా అన్ని అయిపోయిన తర్వాత యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది అనసూయ భరద్వాజ్. జబర్ధస్త్ షో ద్వారా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో ఎదిగిపోయింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకెళ్తోంది.

  అందులో కూడా సత్తా చాటిన అమ్మడు

  అందులో కూడా సత్తా చాటిన అమ్మడు

  సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటిన అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తనదైన శైలి యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. ఈ క్రమంలోనే కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇలా వెండితెరపైనా దూసుకుపోతోంది.

  ఏ సినిమాలో చూసినా అనసూయతోనే

  ఏ సినిమాలో చూసినా అనసూయతోనే

  గతంలో మాదిరిగా ఈ మధ్య అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అయితే, ఆమె ఇప్పుడు ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘థ్యాంక్యూ బ్రదర్'తో ప్రేక్షకుల ముందుకొచ్చి మాయ చేసింది. అలాగే, ‘రంగమార్తాండ'లోనూ నటించింది. వీటితో పాటు ‘వేదాంతం రాఘవయ్య', ‘ఖిలాడీ', ‘హరిహర వీరమల్లు', ‘పుష్ప' వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తోంది.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. ఈ కారణంగానే ఆమె ఎప్పుడూ ఇంటర్నెట్‌లో సెన్సేషల్ అవుతోంది.

  అమ్మాయిల ప్రధాన సమస్యపై కామెంట్స్

  అమ్మాయిల ప్రధాన సమస్యపై కామెంట్స్

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అనసూయ భరద్వాజ్.. ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. అందులో ఇప్పటి అమ్మాయిలు ఎదుర్కొంటోన్న ప్రధానమైన మొటిమల సమస్య గురించి మాట్లాడింది. అదే సమయంలో తన అనుభవాన్ని కూడా అందులో ప్రస్తావిస్తూ ధైర్యం చెప్పింది.

  ఆ పని మాత్రం అస్సలు చేయకండి అంటూ

  ఆ పని మాత్రం అస్సలు చేయకండి అంటూ

  మొటిమల గురించి మాట్లాడుతూ.. ‘గుడ్ మార్నింగ్. నా ముఖం మీద నాలుగు మొటిమలు వచ్చాయి. అందులో ఒక దానిని గిచ్చేశాను. దాని వల్ల మచ్చలా పడిపోయింది. కాబట్టి మీకు పింపుల్స్ వస్తే అలాంటి పని అస్సలు చేయకండి. మొటిమలు రావడాన్ని అమ్మాయిలంతా ఓ సమస్యలా చూస్తారు. ఈ మధ్య అబ్బాయిలూ అలాగే ఫీల్ అవుతున్నారు' అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  అస్సలు భయపడకండి.. అందుకే వస్తాయి

  అస్సలు భయపడకండి.. అందుకే వస్తాయి

  దీనిని కొనసాగిస్తూ.. ‘మొటిమలు రావడం సర్వసాధారణమే. మన శరీరంలో ఉష్టోగ్రత హెచ్చుగా ఉంటే ఇలా జరుగుతుంది. నాకైతే మామిడికాయలు తీనడం వల్ల వచ్చిందని అనుకుంటున్నా. అలా అని సీజనల్ ఫ్రూట్‌ను తినకూడదు అని అర్థం కాదు. దొరికినప్పుడే ఫుల్లుగా లాగించేద్దాం. తర్వాత దొరికినా అవి సురక్షితం కాదు. నేను కూడా మీతోనే ఉన్నాను' అంటూ అనసూయ పేర్కొంది.

  English summary
  Hot Anchor Anasuya Bharadwaj Very Active in Social Media. Now She Shared a Selfie Video in Instagram. In This Video.. She Comments on Pimples.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X