For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anasuya పెళ్లి రోజున కూడా మా ఆయన అదే తీరు.. అందుకే భర్తకు దూరంగా.. ఇన్స్‌టాలో ఎమోషనల్ పోస్ట్

  |

  తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా, టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న అనసూయ ప్రతిభ, వ్యక్తిగత జీవితం ఓపెన్ బుక్ లాంటింది. తన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను ఆమె పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ భర్తతో గొడవల గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో ఆసక్తికరంగా వెల్లడించిన విషయం ఏమిటంటే..

  పెళ్లికి ముందే 10 ఏళ్లపాటు అఫైర్

  పెళ్లికి ముందే 10 ఏళ్లపాటు అఫైర్

  అనసూయ తన పెళ్లికి ముందే 10 సంవత్సరాలపాటు శశాంక్ భరద్వాజ్‌తో ప్రేమలో ఉన్నారు. శశాంక్ కోసం ఇంట్లో వాళ్లను ఎదురించి బయటకు వచ్చారు. ఆ తర్వాత అనసూయ ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చులను శశాంక్ భరించి తనను ప్రేమగా చూసుకొన్నారనే విషయాన్ని అనసూయ స్వయంగా తన ఇంటర్యూలో వెల్లడించింది.

   11 ఏళ్ల దాంపత్య జీవితం గురించి అనసూయ

  11 ఏళ్ల దాంపత్య జీవితం గురించి అనసూయ

  శశాంక్‌ భరద్వాజ్‌తో పదేళ్ల ప్రేమాయణం తర్వాత వారిద్దరు జూన్ 5వ తేదీన పెళ్లి చేసుకొన్నారు. తన 11వ వివాహ వార్షికోత్సవం రోజున తన ప్రేమ గురించి పంచుకొన్నారు. మా క్రేజీ, స్టుపిడ్ ప్రేమకు 20 ఏళ్లు నిండాయి. ఇక మా పెళ్లి బంధానికి 11 సంవత్సరాలు నిండాయి అంటూ ఎమోషనల్‌గా ఓ పోస్టు పెట్టింది.

   ఇద్దరం భారీగా గొడవ పడుతాం

  ఇద్దరం భారీగా గొడవ పడుతాం

  భర్తతో తన అనుబంధం గురించి అనసూయ భావోద్వేగంగా స్పందించారు. మేమిద్దరం ఒకరినొకరం బాధపెట్టుకొంటాం. గొడవ పడుతాం. ఒకరి మాటలను మరొకరు వ్యతిరేకించుకొంటాం. కొన్ని ఇడియాటిక్ విషయాలపై ఒట్టు వేసుకొంటాం. ఇక రేపటి నుంచి మా మధ్య బంధం ఉండదనేంతగా ఫైట్ చేసుకొంటాం. ఇక నుంచి కలిసి ఉండమనేంతగా గొడవ పడుతాం అని అనసూయ తెలిపింది.

  కొట్లాడుకొన్నా.. మా మధ్య విడదీయలేని బంధం

  కొట్లాడుకొన్నా.. మా మధ్య విడదీయలేని బంధం

  ఇక అలాంటి గొడవలను మరిచి అంతకంటే మేమిద్దరం ప్రేమగా, ఆప్యాయతగా ఉంటాం. ఒకరంటే మరొకరం చెప్పలేనంత ఇష్టాన్ని వ్యక్తికరించుకొంటూ చేతులో చేతులు వేసుకొని ముందుకు నడుస్తాం. అలా పిచ్చిగా ప్రవర్తిస్తున్న తీరుతో ఎన్నో ఏళ్లు మా మధ్య గడిచిపోయాయి. అయినా నీ వంటే నాకు మరింత ఇష్టం పెరిగింది. ఐ లవ్ యూ. ఎందకంటే నీవు తప్ప నాకు మరో విషయం నా జీవితంలో ఏమీ తెలియదు అంటూ అనసూయ తన పోస్టులో ఎమోషనల్‌గా స్పందించింది. ఇది నా భర్తకు మాత్రమే.. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పెట్టాద్దామా అంటూ భర్తకు సూచించింది.

  పెళ్లి రోజున కూడా అదే తీరు...

  పెళ్లి రోజున కూడా అదే తీరు...

  మా పెళ్లి రోజున నేను ఎందుకు మా ఇద్దరి ఫోటో పెట్టడం లేదంటే.. ఈ రోజు కూడా నేను, మా ఆయన గొడవ పడ్డాం. అందుకే ఆయనకు దూరంగా ఉన్నా. ఇద్దరం కలిసి ఉన్న ఫోటో పెట్టడం లేదు అంటూ అనసూయ వివరణ ఇచ్చింది. #11thAnniversary #20YearsOfCrazyStupidLove అంటూ హ్యాష్ ట్యాగ్ షేర్ చేసింది. అంతేకాకుండా తన భర్తతో దిగిన సెల్ఫీలతో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ... వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

   అనసూయ భరద్వాజ్ కెరీర్

  అనసూయ భరద్వాజ్ కెరీర్

  అనసూయ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. థ్యాంక్యూ బ్రదర్ అనే చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకొన్నారు. ఇక రవితేజతో ఖిలాడీ.. అల్లు అర్జున్‌తో పుష్ప, మలయాళంలో భిష్మ పర్వం, కృష్ణవంశీతో రంగ మార్తండ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా జబర్దస్త్, ఇతర షోలతో ఆకట్టుకొంటున్నారు.

  English summary
  Anchor and Actress Anasuya Bharadwaj gets emotional on her marriage anniversary. She wrote on Instagram that, We annoy each other.. can’t stand each other sometimes.. swear by some most idiotic things.. fight like there is no tomorrow.. and then.. we hold each other as if nothing matters more than that.. that’s what makes it all real.. To an eternity of such mad years 🥂 I love you ♥️ because I don’t know anything else to do with you.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X