Anasuya Bharadwaj నేను మారను.. అలాంటి సాంగ్స్‌లో నటిస్తా.. అనసూయ
తెలంగాణలో రెండు మతాల మధ్య వైషమ్యాలకు కారణమైన రజాకార్లు అరాచకాల నేపథ్యంగా రూపొందిన చిత్రం రజకార్స్. ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, అనసూయ భరద్వాజ్, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించారు. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. మార్చి 1వ తేదీన దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ..
ధైర్యంగా రజాకార్ చిత్రాన్ని తీసి చరిత్రను అందరికీ చూపిస్తున్నందుకు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి థాంక్స్. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణ గారికి థాంక్స్. మన నైజాంలో, హైద్రాబాద్‌లో ఏం జరిగిందో అందరూ తెలుసుకోవాలి అని అనసూయ ఎమోషనల్ అయ్యారు.

ఫ్రెంచ్ రివల్యూషన్, అలెగ్జాండర్ గురించి కాదు.. ముందు మన గురించి మనం తెలుసుకుందాం. మార్చి 1న ఈ చిత్రం చూసి అందరూ చలించిపోతారు. నేను ఆల్రెడీ ఈ చిత్రాన్ని చూశాను. ఇంద్రజ, ప్రేమ, వేదిక, సింహా, మకరంధ్ గారు ఎంతో మంది అద్భుతంగా నటించారు. సినిమా అనేది చాలా గొప్ప మాధ్యమం. ఈ చిత్రంలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది అని అనసూయ అన్నారు.
ఇటీవల కాలంలో అన్ని రకాల పాత్రలను చేస్తున్నాను. భారమైన పాత్రలు చేసిన తర్వాత కూడా స్పెషల్ సాంగ్స్‌లో కూడా నటిస్తాను. నేను ఎప్పటికీ మారను. నేను మారలేదు. ప్రధానంగా నేను ఎంటర్‌టైనర్‌ను. ప్రత్యేక పరిస్థితుల గురించి నన్ను దృష్టిలో పెట్టుకొని రాసిన పాత్రలు నా వద్దకు వస్తే తప్పుకుండా చేస్తాను అని అనసూయ చెప్పారు.
రజాకర్ అనే సినిమాలో పాత్రకు కనెక్ట్ అయి చేశాను. నేను చేసే ప్రతీ పాత్రకు కనెక్ట్ అవుతాను. చరిత్రలో ఇది జరిగిన యదార్థ గాధ. ఆ చరిత్ర గురించి ఇప్పుడు నేను మాటల్లో చెప్పలేను. కానీ రిలీజ్ తర్వాత నా పాత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. ఇక ముందు కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు అని అనసూయ అన్నారు.


Click it and Unblock the Notifications











