అనసూయకు బంపర్ ఆఫర్.. స్టార్ హీరోతో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా!
టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఇప్పుడు నటిగా బిజీ అయింది. ఇటీవల పుష్ప సినిమాతో హిట్ అందుకున్న ఆమె ఖిలాడీ సినిమాలో కూడా భాగమైంది. ఆ సినిమాలో ఏకంగా రెండు పాత్రల్లో కనిపించిన ఆమెకు బంపర్ ఆఫర్ తగిలినట్టు చెబుతున్నారు. ఆమె మెగా ప్రాజెక్ట్ లో భాగం అయినట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

వరుస సినిమా అవకాశాలు
సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఎంటర్ అయింది. అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలా ఆమెకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ చూసి వరుసగా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

రంగమ్మత్త క్రేజ్
టెలివిజన్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో తెరంగ్రేటం చేసిన ఆమె ఆ తరువాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించింది. ఆ దెబ్బతో అనసూయకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే పుష్ప సినిమాలో కూడా దాక్షాయణి అనే ఒక మంచి రోల్ పట్టేసింది. సునీల్ భార్య ద్రాక్షాయని పాత్రలో అనసూయ మెప్పించింది.

'ఖిలాడి'లో
దాక్షాయణి క్యారెక్టర్ లో డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకున్న అనసూయ రోల్ 'పుష్ప' పార్ట్ 2లో కూడా హైలైట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఆ సంగత్తి పక్కన పెడితే ఆమె రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమాలో కూడా నటించింది. ఖిలాడీ అనే సినిమాలో కూడా రెండు పాత్రల్లో నటించింది. చంద్రకళ అనే ఒక పాత్రలో అలాగే చాందిని అనే మరో పాత్రలో కూడా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

బంపర్ ఆఫర్
యాంకర్ అనసూయ ఒక ర్కారంగా టాలీవుడ్‌లో వేగంగా దూసుకుపోతోందనే చెప్పాలి. అయితే ఆమెకు ఒక బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలిసింది. అనసూయకు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో అవకాశం దక్కిందని టాక్ వినిపిస్తోంది. 2015లో అజిత్ నటించిన సూపర్ హిట్ తమిళ చిత్రం వేదాళంకి ఇది రీమేక్. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనుండగా, మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చనున్నారు.

చిరు చెల్లెలుగా కీర్తి
చిరుతో మెహర్ రమేష్ కలిసి పని చేయడం ఇదే తొలిసారి కాగా మెహర్ రమేష్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం వహించనున్నారు. అనసూయ పాత్రకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియనప్పటికీ, అధికారిక వివరాలు అతి త్వరలో వెలువడనున్నాయి. భోళా శంకర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రను పోషిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు అయితే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











