For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను అలా టీజింగ్ చేసేవారు.. ఆ హీరో అడగడంతో చూపించక తప్పలేదు: అనసూయ

    By Manoj
    |

    ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన తక్కువ వ్యవధిలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఆమె... ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంది. అంతేకాదు, సినిమా రంగంలోకి సైతం అడుగు పెట్టింది. దీంతో చేతి నిండా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ తన క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆ సంగతులేంటో మీరూ చూడండి!

    Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
     ఇక్కడ మాత్రమే కాదు... అక్కడ కూడా హిట్

    ఇక్కడ మాత్రమే కాదు... అక్కడ కూడా హిట్

    జబర్ధస్త్‌తో వచ్చిన స్టార్‌డమ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడంలో అనసూయ సూపర్ సక్సెస్ అయింది. ఇందులో భాగంగానే టీవీ ఆఫర్లతో పాటు సినిమా అవకాశాలనూ అందుకుంది. ఈ క్రమంలోనే ‘సోగ్గాడే చిన్ని నాయన', ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా క్షణం, రంగస్థలంలో ఆమె పాత్రలకు ప్రశంసలు దక్కాయి.

     ఆ విషయంలో మాత్రం అనసూయకు నిరాశే

    ఆ విషయంలో మాత్రం అనసూయకు నిరాశే

    వరుసగా సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ వెళ్తోంది అనసూయ భరద్వాజ్. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలు అందులో పోస్ట్ చేస్తోంది. అలాగే, తన ఫోటోలనూ వదులుతోంది. ఈ క్రమంలోనే కొన్ని హాట్ ఫొటోల వల్ల నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోందీ ముద్దుగుమ్మ.

    ఐదు వేల రూపాయల కోసం ఆ పని చేశాను

    ఐదు వేల రూపాయల కోసం ఆ పని చేశాను

    బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా కొనసాగుతూనే... వెండితెరపై క్రేజీ ఆర్టిస్టుగా వెలుగొందుతోంది అనసూయ భరద్వాజ్. ఈ నేపథ్యంలో ఆమె ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘అలీతో సరదాగా' అనే షోకు వచ్చింది. ఇందులో భాగంగానే హోస్ట్ అలీ అడిగిన ఎన్నో విషయాలకు సమాధానం చెప్పింది. అంతేకాదు, 5 వేల కోసం టెలీ కాలర్‌గా పని చేశానని కొత్త విషయం వెల్లడించింది.

    నాకు ఇష్టం లేకపోయినా అది చూపించాను

    నాకు ఇష్టం లేకపోయినా అది చూపించాను

    ‘క్షణం'లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ... ‘క్షణంలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రను చేశాను. అడివి శేష్ బలవంతం చేయడంతో దాని కోసం వెనక్కి దువ్వుకుని టైట్‌గా జడ వేసుకోవాల్సి వచ్చింది. దీంతో నా నుదురు చూపించాల్సి వచ్చింది. మొదట్లో నన్ను అందరూ బట్టతలదానా అనేవారు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ధైర్యంగా చూపించగలుగుతున్నా' అని ఆమె చెప్పుకొచ్చింది.

    English summary
    Anasuya Bharadwaj is an Indian television presenter and actress. As an actress she has worked predominantly in Telugu cinema and Telugu television shows. She received the IIFA Award for Best Performance In A Supporting Role – Female in 2017, for her role in Kshanam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X