అడివి శేష్ ఫోర్స్ చేయడంతో అది చూపించా.. అలాంటి దాన్ని అనుకున్నారు: తొలిసారి బయటపెట్టిన అనసూయ
చూపు తిప్పుకోకుండా చేసే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా సత్తా చాటింది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. టెలివిజన్ రంగంలోకి వచ్చిన తక్కువ వ్యవధిలోనే ఊహించని రీతిలో పాపులారిటీని అందుకున్న ఆమె... ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంది. అంతేకాదు, సినిమా రంగంలోకి సైతం అడుగు పెట్టింది. దీంతో చేతి నిండా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ.. అడివి శేష్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆ సంగతులేంటో మీరూ చూడండి మరి!
అలా మొదలైన అనసూయ జర్నీ
అనసూయ ఎంబీఏ పూర్తి చేసి స్టాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత అక్కడ రాజీనామా చేసి యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంతో తన ప్రియుడు సుశాంక్‌ను వివాహం చేసుకుంది. అతడి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది.

జబర్ధస్త్‌గా ఎంట్రీ.. కెరీర్ టర్నింగ్
న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న సమయంలోనే అనసూయకు యాంకర్‌గా అవకాశం లభించింది. అదే... ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో నుంచి అన్న విషయం తెలిసిందే. అందులోకి ఎంటర్ అయిన కొద్ది రోజుల్లోనే అనసూయకు మంచి పేరు దక్కింది. అంతేకాదు, భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అందుకుంది. ఫలితంగా ఎన్నో ఆఫర్లను అందుకుంది.
మూవీల్లో కూడా అనసూయ హిట్
జబర్ధస్త్‌తో వచ్చిన స్టార్‌డమ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడంలో అనసూయ సక్సెస్ అయింది. ఇందులో భాగంగానే టీవీ ఆఫర్లతో పాటు సినిమా అవకాశాలనూ అందుకుంది. ఈ క్రమంలోనే 'సోగ్గాడే చిన్ని నాయన', 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'పుష్ప', 'రంగమార్తాండ', 'విమానం' వంటి చిత్రాల్లో అద్భుతమైన రోల్స్ చేసింది.

టీవీలోకి కూడా.. ఆ భారీ చిత్రాల్లో
టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం తమిళంలో 'పుష్ప 2', 'హరిహర వీరమల్లు' సహా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇక, ఇటీవలే అనసూయ 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోతో మరోసారి బుల్లితెరపైకి వచ్చింది. ఇందులో ప్రవర్తనతో అందరికీ షాక్ ఇచ్చేసింది.
సినిమాల కోసం కొన్ని తప్పవు
వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న అనసూయ భరద్వాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగానే ఆమె 'నేను సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వచ్చాయి. అందులో మంచి పాత్రల కోసం చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు అలాంటివే నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి' అని చెప్పొచ్చింది.

అడివి శేష్ వల్ల అది చూపించా
అనసూయ ఇదే ఇంటర్వ్యూలో 'క్షణంలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రను చేశా. హీరో అడివి శేష్ ఫోర్స్ చేయడంతో దాని కోసం వెనక్కి దువ్వుకుని టైట్‌గా జడ వేసుకున్నాను. దీంతో నా నుదురు భాగం చూపించాల్సి వచ్చింది. అంతకుముందు నన్ను అందరూ బట్టతలదానా అనేవారు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఫోర్‌హెడ్‌ను ధైర్యంగా చూపించగలుగుతున్నా' అని వివరించింది.


Click it and Unblock the Notifications











