Anasuya Bharadwaj Romantic Photos: భర్తతో అనసూయ ఫోటోల రచ్చ.. ఆ రేంజ్‌లో చిలిపిగా రొమాన్స్

ఓ సాధారణ యాంకర్ స్టేజ్ నుంచి స్టార్ సెలబ్రెటీ స్టేజ్‌కు చేరుకున్నారు అనసూయ భరద్వాజ్. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించడమే కాదు, యువతకు కూడా అదే చెబుతుంటారు. తాను జీవితంలో పడిన ఇబ్బందులు, కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలను పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు అనసూయ. తన షూటింగ్‌లు, ఈవెంట్లు లేనప్పుడు భర్త, పిల్లలతో గడపటానికి ఆమె ఇష్టపడతారు. తాజాగా భర్త సుశాంక్ భరద్వాజ్‌తో సరదాగా గడిపిన క్షణాలను అనసూయ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్.. చిన్నాచితకా షోలు చేసుకుంటూ కొనసాగుతున్న దశలో ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. హాట్ హాట్ డ్రెస్సులు వేసుకొచ్చి షో ప్రారంభానికి ముందు ఆమె చేసే అందాల ప్రదర్శన కోసమే జబర్దస్త్ చూసేవారు కుర్రకారు . జడ్జిలుగా నాగబాబు- రోజా, కంటెస్టెంట్స్‌ టాలెంట్‌కు తోడు అనసూయ అందచందాలు జబర్దస్త్ షో బాగా పాపులర్ అవ్వడానికి ఓ రీజన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రోగ్రామ్ మధ్యలో అనసూయ వేసే జోకులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

anasuya bharadwaj latest trendy look photos with her husband susank bharadwaj goes viral

జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో పాటు పలు సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా అవకాశాలను అందుకుని బాగా బిజీ అయ్యారు. వీటితో అనసూయ తెలుగు లోగిళ్లకు బాగా చేరువయ్యారు . ఇదే సమయంలో సినిమాల్లోనూ అనసూయకు అవకాశాలు వచ్చాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె సినీ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో అనసూయకు అవకాశాలు క్యూకట్టాయి.

క్షణం, విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, ఖిలాడీ, విమానం, పెద్దకాపు, రజాకార్ వంటి సినిమాల్లో అనసూయ నటించింది. ఇక
సుకుమార్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పలో ద్రాక్షాయణిగా నెగిటివ్‌ రోల్‌లో నటించి మెప్పించారు అనసూయ. అందాల ఆరబోత, గ్లామర్ రోల్సే కాదు.. మంచి రోల్ పడితే తన స్టామినా ఇది అని ఈ స్టార్ యాంకర్ నిరూపించారు. త్వరలో రిలీజ్ కానున్న పుష్ప2లో అనసూయ ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తారోనని ఉత్కంఠ నెలకొంది.

anasuya bharadwaj latest trendy look photos with her husband susank bharadwaj goes viral

తెలుగులో యాంకర్‌గా, నటిగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న అనసూయ జబర్దస్త్‌ను వీడటం ఆమె అభిమానులకు షాకిచ్చింది. సినిమాల్లో బిజీ అవ్వడానికే ఆమె జబర్దస్త్‌ను వదిలేశారనే కామెంట్స్ వినిపించాయి. కాదు.. కాదు.. మల్లెమాలకు అనసూయకు వచ్చిన విభేదాల వల్లనే ఆమె తప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఖచ్చితమైన కారణం ఇదేనని ఏం తెలియలేదు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే అనసూయ.. తన సినిమాలు, షోల వివరాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తరచుగా ఇన్‌స్టా, ట్విట్టర్ లైవ్‌లు నిర్వహించి అభిమానులతో టచ్‌లో ఉంటారు. అయితే ఆమెతో మాట్లాడాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే మరి. రెండ్రోజుల క్రితం యాంకర్ రవి పుట్టినరోజు వేడుకలకు భర్త సుశాంక్‌తో కలిసి హాజరయ్యారు. పార్టీలో రవి, సుశాంక్ క్లోజ్‌గా ఉండటంతో నన్ను కూడా పట్టించుకోండ్రా బాబు అంటూ అనసూయ అలిగారు. తాజాగా యెల్లో కలర్ డ్రెస్‌లో భర్త సుశాంక్‌తో చిలిపి పనులు చేస్తున్న ఫోటోలను అనసూయ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X