గత్తరలేపుతున్న అనసూయ లుక్.. ఎంత భయంకరంగా ఉందో.. నెవర్ బిఫోర్ అంతే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పుష్ప.. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భారీగా ఆసక్తి నెలకొంది.. అయితే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల విషయంగా సినిమా మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాసిల్, సునీల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ఇప్పుడు తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ ని కూడా సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో అనసూయ గత్తర లేపే పాత్రలోనే నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

అలా కెరీర్ మొదలు పెట్టి

అలా కెరీర్ మొదలు పెట్టి

సాక్షి ఛానల్ లో న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ అనతి కాలంలోనే ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో అడుగు పెట్టి ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా ఒక స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి సుమ ఉదయ భాను లాంటి వాళ్ళు సంపాదించిన క్రేజ్ మొత్తాన్ని అనతి కాలంలోనే సంపాదించిన అనసూయ ఆ తర్వాత తనకు ఇష్టమైన నటనా రంగం మీద కూడా దృష్టి పెట్టింది. ముందు చిన్నా చితక పాత్రలు చేసిన సుకుమార్ దర్శకత్వంలో రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ కు ఒక మైలురాయి.

ఆ పాత్ర చేయడంతో

ఆ పాత్ర చేయడంతో

ఆ పాత్ర చేసిన తర్వాత అనసూయ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క టీవీ ప్రోగ్రాములు చేసుకుంటూ ఆమె బిజీ బిజీగా గడిపేస్తున్నారు.. ఇదే సమయంలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అనసూయను సంప్రదించారు.

 రంగస్థలంతో

రంగస్థలంతో

గతంలో రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్ర చేసిన ఆమె సుకుమార్ తో మంచి మార్నింగ్ ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలో కూడా కీలక పాత్రల్లో నటించడానికి ఒప్పుకున్నారు. ఇక ఈ పాత్ర కూడా చాలా అద్భుతంగా వచ్చిందని ఫిలిం నగర్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

దాక్షాయణి

దాక్షాయణి

తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. దాక్షాయణిగా అనసూయను పరిచయం చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. దాక్షాయణి అనే ఒక అహంకారం నిండిన మహిళ పాత్రను అనసూయ పోషిస్తోంది. ఆ పోస్టర్ లోనే దాక్షాయణి అహంకారం ఉట్టి పడుతోంది. మంగళం శ్రీను పాత్ర పోషిస్తున్న సునీల్ భార్య పాత్రగా ఈ రోల్ ఉండబోతోంది అనే ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
వచ్చేస్తోంది

వచ్చేస్తోంది

ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'పుష్ప' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను సిద్ధమవుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం "పుష్ప: ది రైజ్" పేరుతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేకర్స్ చిత్రం నుంచి మూడు పాటలను విడుదల చేయగా, అన్ని పాటలకూ మంచి స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X