పెద్ద హీరో, డైరెక్టర్ నుంచి కమిట్ మెంట్లు.. వారికి లొంగిపోకపోతే.. అనసూయ షాకింగ్ నిజాలు!
అనసూయ భరద్వాజ్.... ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను నటిగా అలరిస్తున్న ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర అందాల తారగా, 'జబర్దస్త్' యాంకర్ గా పదేళ్ల పాటు అలరించింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తనకున్న యాంకరింగ్ ప్రతిభతో అంచలంచెలుగా ఎదిగింది. అంతేకాకుండా ఆమె డ్యాన్స్ తోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అలా కొంత క్రేజ్ సంపాదించుకుంది. ఇక కొన్నాళ్లుగా మాత్రం బుల్లితెరకు దూరంగానే ఉంటోంది. అదే సమయంలో వెండితెరపై వరుస చిత్రాలో అలరిస్తూనే వస్తోంది.
బుల్లితెరకు దూరమైనా.. సినిమాలు, ఇంటర్వ్యూలతో ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. ఈ క్రమంలోనే అనసూయ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంటున్నారు. కాగా తాజాగా అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో లేడీస్ కు ఆఫర్లు అందాలంటే కమిట్ మెంట్లు సాధారణమంటూ స్టార్ యాంకర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గ్గా మారాయి. అంతెందుకు అలాంటి పరిస్థితిని అనసూయనే కోకొల్లలుగా ఎదుర్కున్నట్టు చెప్పుకొచ్చింది.

రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ భరద్వాజ్... టాలీవుడ్ లో కమిట్ మెంట్లపై ఆసక్తికరంగా స్పందించారు. టాలీవుడ్ లో బిగ్ డైరెక్టర్, బిగ్ హీరో కూడా కమిట్ మెంట్ అడిగారని షాకింగ్ న్యూస్ వెల్లడించారు. ప్రొడ్యూసర్స్ పెద్దగా అలాఏమీ లేరని చెప్పారు. ఇక తనకే కోకొల్లలుగా కమిట్ మెంట్తో సినిమా ఆఫర్లు వచ్చాయని నిర్మోహమాటంగా చెప్పింది. దాంతో ఆమెను సినిమా పేరుతో కమిట్ మెంట్ అడిగిన ఆ బిగ్ డైరెక్టర్, బిగ్ హీరో ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
అలాంటి చెత్త ఆఫర్లు ఉండటం వల్లే తను పెద్ద సంఖ్యలో సినిమాలు చేయలేదని, తన కెరీర్ కు ఉపయోగపడే సినిమాలు, క్యారెక్టరస్ లో మాత్రమే నటించానని చెప్పింది. వాళ్లు ఇచ్చే ఆఫర్లకు ఒప్పుకోకపోతే సినిమాల్లో అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతారని, దాని వల్ల త్వరగా ఎదగాల్సిన వారికి కష్టం అవుతుందని అభిప్రాయపడింది. ఇక తను చాలాసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చారు... నిర్మోహమాటంగా అలాంటి చెత్త డైరెక్టర్స్, హీరోలకు నో చెప్పానని చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి దుస్థితి కేవలం సినిమా రంగంలోనే కాకుండా.. ఇతర ఇండస్ట్రీల్లోనూ ఉందని చెప్పుకొచ్చింది. కానీ సినిమా రంగుల లోకం కాబ్టటి.. ఆకర్షించే వ్యక్తులు ఉండటంతో సినిమా వాళ్లే ఎక్కువగా ఫోకస్ అవుతుంటారని చెప్పుకొచ్చింది.
ఇక అనసూయ బుల్లితెరపై పదేళ్లు మెరిసింది. కామెడీ అయినప్పటికీ తనదైన యాంకరింగ్ స్కిల్స్... డ్యాన్స్, అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూ ఆకట్టుకుంది. అలాగే నటనపై ఆసక్తితోనూ సినిమాల్లోకి అడుగుపెట్టింది. 'క్షణం', 'రంగస్థలం', 'యాత్రం'; 'ఖిలాడీ', 'విమానం', 'పెద్దకాపు 1', 'రాజాకార్', 'పుష్ప' వంటి చిత్రాల్లో నటించి దుమ్ములేపింది. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు : పార్ట్ 1'తో అలరించనుంది. పవన్ కళ్యాణ్ తో స్పెషల్ అప్ఫీయరెన్స్ ఇవ్వబోతోంది. అలాగే తమిళంలోనూ 'ఫ్లాష్ బ్యాక్', 'వోల్ఫ్' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











