Just In
- 11 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 13 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 45 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్: బన్నీని కొట్టడానికి అనసూయ ప్లాన్.. ఫైటర్స్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న హాట్ యాంకర్
అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఈ హాట్ యాంకర్.. అనతి కాలంలోనే అత్యంత భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. చాలా ఏళ్లుగా ఈ షోను హోస్ట్ చేస్తున్న అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. అందుకే ఆమెకు సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే తనలోని ఎన్నో యాంగిల్స్ చూపించిన ఈ అమ్మడు.. అల్లు అర్జున్‌తో ఫైట్ చేయడానికి సిద్ధపడుతుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

రెండు తెరపైనా మెప్పిస్తున్న అనసూయ
అనసూయకు బుల్లితెర యాంకర్‌గానే గుర్తింపు వచ్చింది. అందంతో పాటు హావభావాలు పలికించడంలోనూ నేర్పరి కావడంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా భారీగానే వస్తున్నాయి. ఇప్పటికే ‘క్షణం', ‘యాత్ర', ‘సోగ్గాడే చిన్ని నాయన' వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇక, ‘రంగస్థలం'లో రంగమ్మత్త క్యారెక్టర్‌లో జీవించి పలు అవార్డులను అందుకుంది.

అక్కడ కూడా ఆమెకు తిరుగులేదు
అనసూయ షూటింగ్ ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటోంది. ఇందులో భాగంగానే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈ హాట్ యాంకర్ అనసూయను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

ఎంతో మంది వచ్చినా కొన్నింటికే
బుల్లితెర.. వెండితెరపై రాణిస్తున్న అనసూయకు భారీ క్రేజ్ ఉంది. అందుకే దానిని క్యాష్ చేసుకునేందుకు చాలా మంది ఫిల్మ్ మేకర్లు ఆమెను తమ సినిమాల్లో నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే అనసూయ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదేనన్న టాక్ ఉంది.

స్పైసీ రోల్‌కు అనసూయ గ్రీన్ సిగ్నల్
పోయిన ఏడాది అనసూయ ‘కథనం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత అనసూయ.. సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో ఆమె స్పైసీ రోల్ చేస్తుందని డైరెక్టర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

బన్నీని కొట్టడానికి అనసూయ ప్లాన్
అనసూయ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఆమె ఓ పాత్రను చేస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా ఇందులో ఆమె చేసేది నెగెటివ్ రోల్ అని వార్త ఒకటి లీక్ అయింది. ఇందులో బన్నీతో అనసూయ పోరాటం చేస్తుందని అంటున్నారు.

ఫైటర్స్ దగ్గర హాట్ యాంకర్ శిక్షణ
ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కొన్ని పోరాట సన్నివేశాల్లోనూ నటించబోతుందని అంటున్నారు. ముఖ్యంగా ఆమె చేసే ఫైటింగుల్లో ఎక్కువ శాతం బన్నీతోనే ఉంటాయని కూడా తెలుస్తోంది. అందుకోసం ఆమె కొద్ది రోజులుగా ఫైటర్స్ నుంచి ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటుందని ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో అనసూయ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.