అమెరికా వెళ్లొచ్చింది.. అనసూయ నిజస్వరూపం బయటపడింది.. షాకైపోతున్న ఫ్యాన్స్
Recommended Video
అనసూయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె చాలా ఫేమస్. బుల్లితెర అయినా వెండి తెర అయినా ఈమె రంగంలోకి దిగిందంటే ఆ ప్రత్యేకతే వేరు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ వైపు టీవీ షోలు.. మరోవైపు, సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. ఏమాత్రం తరగని అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అందానికి తోడు బోల్డు స్టేట్‌మెంట్లు కూడా ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

సోషల్ మీడియాలో యవ యాక్టివ్
అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకోవడం పరిపాటి అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ కూడా తరచూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు ట్రోలర్స్ బారిన పడుతోంది.

స్కిన్ షోతో వివాదాలు
అనసూయకు ఎంత పాపులారిటీ ఉందో అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని ఫొటోలకు భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి కారణం స్కిన్ షో చేయడమే. ఈ కారణంగానే ఆమె ఎన్నో వివాదాలను కొని తెచ్చుకుంది. ఈ విధంగానూ అనసూయ తరచూ వార్తల్లోకెక్కుతుంది.

అమెరికాలో హల్‌చల్
ఇటీవల తానా ఉత్సవాల కోసం అమెరికా వెళ్లింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. ఈ క్రమంలోనే అంతా కలిసి దేశం మొత్తం కలియ తిరిగారు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను తన అభిమానులతో పంచుకుంటోంది. ఈ ఫొటోలను అమెరికా డైరీస్ అనే ఆల్బమ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అనందాన్ని వ్యక్త పరిచింది ఈ రంగమ్మత్త.
అదే దెబ్బకొట్టిందంటూ..
అనసూయ అమెరికాలో ఫుల్లుగా తిరిగేసింది. ఈ క్రమంలో ఎండను సైతం లెక్క చేయలేదు. దీంతో తన అందం పాడయిందని స్వయంగా తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, ‘అమెరికాలోని వేసవి నాకీ ముఖాన్ని ఇచ్చింది. కానీ, ఈ ఫొటో నాకు నచ్చింది. దీనికి కారణం ఫొటో తీసిన సుశాంక్ భరద్వాజే' అని క్యాప్షన్ పెట్టింది.

ఫొటో చూసి షాకైపోతున్నారు
అనసూయ షేర్ చేసిన ఫొటో చూసి ఆమె అభిమానులు షాకైపోతున్నారు. ఎప్పుడూ అందంగా కనిపించే తమ అభిమాన నటి.. ఒక్కసారిగా ఇలా దర్శనమివ్వడంతో వారంతా అవాక్కవుతున్నారు. దీనిపై వారికి తోచినట్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా
అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కథనం'. రాజేశ్ నాదెండ్ల దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పృథ్వీ, అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్ ఇతర పాత్రధారులు. నిర్మాణానంతర కార్యక్రమాలు, సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాను ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











