Anasuya : శివాజీ ఉద్దేశం కరెక్టే.. కానీ, అనసూయ షాకింగ్ కామెంట్స్..

Anasuya Bharadwaj-Shivaji: టాలీవుడ్‌లో ఇటీవల హీరోయిన్ల వస్త్రాధారణపై చెలరేగిన వివాదం ఇంకా చల్లారలేదు. యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. నటుడు శివాజీ (Shivaji) 'దండోరా'ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో మహిళా కమిషన్ జోక్యం చేసుకోవడం,శివాజీ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం, క్షమాపణల వరకు వెళ్లిన ఈ ఇష్యూకి పుల్ స్టాప్ పడలేదు. ఈ అంశంపై మరికొందరూ తమ అభిప్రాయాన్ని వెల్లడించడం, కొంతమంది శివాజీకి సపోర్టు చేయగా, మరికొందరూ అనసూయకు సపోర్టు చేయడంతో ఈ సమస్య తీవ్రమైంది. ఈ వివాదంపై తాజాగా అనసూయ మరోసారి స్పందించడం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

Anasuya Bharadwaj on Shivaji Controversy

ఈ సందర్భంగా అనసూయ ముందుగా శివాజీ వ్యక్తిత్వాన్ని, ఆయన సినీ ప్రయాణాన్ని గౌరవిస్తూ మాట్లాడింది. 'శివాజీ గారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ప్రజలు ఆయన మాట వినేలా గుర్తింపు సంపాదించుకున్నారు'అంటూ ఆయన స్థాయిని గుర్తించింది. ఆయన సినిమాల్లో పోషించిన పాత్రలకు ప్రజలపై ప్రభావం ఉండటం సహజమేనని, అయితే ఆ ప్రభావం సినిమాల వరకే పరిమితమై ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది.

అయితే ఇక్కడ సినిమాల కథలు, పాత్రల స్వభావంపై చర్చ చేయడం లేదని కూడా స్పష్టంగా చెప్పింది. శివాజీ మహిళల భద్రత గురించి మంచి ఉద్దేశంతోనే మాట్లాడారని అనసూయ ఎక్కడా ఖండించలేదు. నిజానికి ఆ ఉద్దేశాన్ని ఆమె పూర్తిగా అంగీకరించింది. 'ఆడవాళ్ల భద్రత గురించి మంచి ఉద్దేశంతో మాట్లాడినప్పుడు, అదే సమయంలో అబ్బాయిలతో కూడా మాట్లాడి ఉంటే బాగుండేది'అని స్పష్టంగా చెప్పింది. కేవలం అమ్మాయిలకే జాగ్రత్తలు చెప్పడం, వాళ్లని నియంత్రించాలనే భావనతో మాట్లాడటం వల్ల అసలు సమస్య పరిష్కారం కాదని ఆమె అభిప్రాయపడింది.

సమాజంలో మార్పు రావాలంటే.. 'అరే అబ్బాయిలూ... అమ్మాయిలను వారికి నచ్చినట్లే ఉండనివ్వండి. వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా జీవించే హక్కు ఉంది. ఏదైనా ఆపద వస్తే, ఇలాంటి వెధవలు ఎదురైతే మీరు వాళ్లకు సెక్యూరిటీగా నిలబడండి. మనం వాళ్లని కాపాడుకుందాం. మనం అలా ప్రవర్తించొద్దు'అని చెప్పి ఉంటే, ఈ వివాదం వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడింది.

ప్రస్తుతం ఈ వీడియా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన మాటల ద్వారా మహిళల భద్రత అనేది కేవలం మహిళల బాధ్యత కాదు. అది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా పురుషులు తమ ప్రవర్తన, ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పరోక్షంగా సూచిస్తున్నట్టు అర్థమవుతోంది. మొత్తానికి ఆమె మాటల్లో శివాజీ వ్యక్తిత్వంపై గౌరవం స్పష్టంగా కనిపిస్తూనే, సామాజిక అంశాలపై మాట్లాడేటప్పుడు జెండర్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింంది.

ఈ వివాదంలో అనసూయ, చిన్మయి, నాగబాబు వంటి వారు స్పందించడంతో విషయం మరింత పెద్దదైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'అనసూయ vs శివాజీ' అన్నట్లుగా పరిస్థితి మారింది. అనసూయపై ట్రోలింగ్ కూడా భారీగానే జరిగింది. అయినా ఆమె వెనక్కి తగ్గకుండా, ప్రత్యక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేయకపోయినా ఫొటోలు, వీడియోల ద్వారా తన స్టాండ్‌ను గా వెల్లడిస్తూ వచ్చింది. ఇక తాజాగా వీడియో వైరల్ కావడంతో సినీ, సోషల్ మీడియా వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X