అల్లు అర్జున్ నిర్ణయంతో అనసూయకు భారీ షాక్.. కెరీర్‌లో తొలిసారి ఇలా!
ఆలస్యంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపు సంపాదించుకుంది బుల్లితెర యాంకర్ అనసూయ. 'జబర్ధస్త్' ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అదే సమయంలో సినిమాల్లోకి సైతం ఎంటర్ అయింది. అక్కడ కూడా అద్భుతమైన నటనను కనబరిచి ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అనసూయకు భారీ ఎదురుదెబ్బ తగిలిందట. ఆ వివరాలు మీకోసం.!

ఎక్కడ చూసినా అనసూయనే కనిపిస్తోంది
బుల్లితెరపై వచ్చే చాలా ప్రోగ్రామ్‌లలో, స్పెషల్ ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లలో అనసూయనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆమెకు ఉన్న పాపులారిటీతో మరిన్ని అవకాశాలు అందుకుంటోంది. అదే సమయంలో సినిమాల్లో సైతం నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో ఆమె నటించింది. వాటిలో ‘క్షణం', ‘యాత్ర', ‘సోగ్గాడే చిన్ని నాయన', ‘రంగస్థలం' గుర్తింపును తెచ్చాయి.

తెలుగు ప్రజలకు నీతులు చెబుతుంటుంది
ఒకవైపు బుల్లితెరపై వచ్చే ప్రోగ్రామ్‌లు.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది అనసూయ. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సామాజిక అంశాలపై నెటిజన్లకు నీతులు చెబుతుంటోంది.

ఎన్నో వచ్చినా కొన్ని మాత్రమే ఒప్పుకుంటోంది
గ్లామర్‌తో పాటు యాక్టింగ్ కూడా అద్భుతంగా చేయగలిగే అనసూయ కోసం చాలా మంది ఫిల్మ్ మేకర్లు వేచి చూస్తుంటారు. తమ సినిమాలో నటించాలంటూ ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు ఆమెకు కథలు కూడా వినిపిస్తున్నారు. అయితే, అనసూయ మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేసేందుకు ఇష్టపడుతోంది.

సూపర్ హిట్ మూవీ రీమేక్‌లో స్పైసీ రోల్
గత ఏడాది ‘కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనసూయ. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఇక, ఈ ఏడాది ఆమె కొన్ని సినిమాలకు కమిట్‌మెంట్ ఇచ్చింది. అందులో కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘నటసామ్రాట్' మూవీ రీమేక్ ‘రంగమార్తాండ' ఒకటి. ఇందులో ఆమె స్పైసీ రోల్ చేస్తుందని డైరెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ స్టార్ హీరోలందరి ఛాయిస్ అనసూయనే
వరుస ఆఫర్లు అందుకుంటోన్న అనసూయ.. స్టార్ హీరోల సినిమాల్లో నటించబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న మూవీతో పాటు చిరంజీవి కొత్త సినిమాలో ఆమె నటిస్తుందని అన్నారు. వీటిపై క్లారిటీ లేదు కానీ... అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప'లో మాత్రం ఆమె కీలక పాత్ర చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
Recommended Video

బన్నీ వల్ల అనసూయకు భారీ ఎదురుదెబ్బ
‘పుష్ప'లో అనసూయ నటిస్తుందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఈ మూవీ నుంచి అనసూయను తీసేశారట. దీనికి కారణం ఆమె స్థానంలో బన్నీ.. నివేదా థామస్‌ను తీసుకుందామని సుకుమార్‌కు చెప్పడమే అని సమాచారం. ఇదే నిజమైతే.. కెరీర్‌లో మొదటిసారి ఓ సినిమా అవకాశం కోల్పోతుంది అనసూయ.


Click it and Unblock the Notifications











