For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంట్లో అనసూయ అలాంటి బట్టలు వేసుకుంటుందా: పుట్టినరోజున వైరల్ అవుతోన్న యాంకర్ పర్సనల్ వీడియో

  |

  అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరిది. దాదాపు ఐదారేళ్లుగా బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా అందంతో పాటు యాక్టింగ్‌తో ఆకట్టుకుంటోందామె. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ దూసుకుపోతోంది. కొంత కాలంగా గ్లామర్ ట్రీట్‌తోనూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అనసూయ భరద్వాజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన పర్సనల్ వీడియో వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  అలా మొదలైన అనసూయ కెరీర్

  అలా మొదలైన అనసూయ కెరీర్


  జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాగ' సినిమాతో నటిగా కెరీర్‌ను ఆరంభించింది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె.. చదువు పూర్తి చేసింది. ఆ వెంటనే ప్రముఖ చానెల్‌లో న్యూస్ రీడర్‌గా పని చేసింది. అలా కొంత కాలం పని చేసిన సమయంలోనే కొన్ని సినిమా ఈవెంట్లను కూడా హోస్ట్ చేసింది. ఫలితంగా ఎంతో మంది దృష్టిలో పడిపోయింది.

  జబర్ధస్త్‌తో మొత్తం మారిపోయింది

  జబర్ధస్త్‌తో మొత్తం మారిపోయింది

  న్యూస్ ప్రజెంటర్‌గా పని చేస్తోన్న టైమ్‌లోనే అనసూయ భరద్వాజ్‌కు జబర్ధస్త్‌ షోలో అవకాశం వచ్చింది. దీని ద్వారానే ఆమె యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించింది. తద్వారా వరుస ఆఫర్లతో పాటు పాపులారిటీని సైతం భారీగా దక్కించుకుంది.

  వెండితెరపై సత్తా... అది స్పెషల్‌గా

  వెండితెరపై సత్తా... అది స్పెషల్‌గా

  బుల్లితెరపై ఎన్నో షోలలో హోస్టు చేసి మెప్పించిన అనసూయ.. సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ‘సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో మెప్పించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను చేసింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందీ బ్యూటీ. వీటిలో రంగమ్మత్త రోల్ స్పెషల్.

  టాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది

  టాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది

  అనసూయ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో ఇండస్ట్రీలో హవాను చూపిస్తోంది. ఇప్పటికే కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటించింది. ‘థ్యాంక్యూ బ్రదర్' ఇటీవలే విడుదలైంది. అలాగే సునీల్ ‘వేదాంతం రాఘవయ్య', రవితేజ ‘ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. వీటితో పాటు పవన్ ‘హరిహర వీరమల్లు', అల్లు అర్జున్ ‘పుష్ప' చిత్రాల్లోనూ నటిస్తోందీ అందాల యాంకరమ్మ.

  తల్లైనా తరగని అందంతో ఫేమస్

  తల్లైనా తరగని అందంతో ఫేమస్

  యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టక ముందే అనసూయ భరద్వాజ్.. శశాంక్‌ను వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తల్లైనా ఘాటు అందాలతో రెచ్చగొడుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో హల్‌చల్ చేస్తోంది. దీంతో ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కొంటోంది.

  ఎప్పుడూ అందులోనే బిజీగా ఉంటూ

  ఎప్పుడూ అందులోనే బిజీగా ఉంటూ


  సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఎంత యాక్టివ్‌గా ఉంటోందో అందరికీ తెలిసిందే. తరచూ తన ఫొటోలు, వీడియోలతో పాటు ఎన్నో విషయాలను తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  అనసూయ పర్సనల్ వీడియో వైరల్

  అనసూయ పర్సనల్ వీడియో వైరల్

  ఈరోజు అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పర్సనల్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఆమె టీషర్ట్ ఒక్కటే ధరించింది. బయట వర్షం పడుతుండగా.. కొడుకుతో వచ్చి పేపర్‌తో చేసిన పడవలను నీటిలో వదులుతోంది. ఇది చూసిన వారంతా ఈ హాట్ యాంకర్ ఇంట్లో ఇలాంటి బట్టలే వేసుకుంటుందా అని షాకైపోతున్నారు.

  English summary
  Today is Anasuya Bhardwaj's birthday. One of her personal videos on this occasion is going viral. She was the only one wearing a t-shirt.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X