For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శుభవార్త చెప్పిన అనసూయ: మరోసారి తల్లిని అవుతా.. తన కోసమే టైమ్ కేటాయిస్తా అంటూ మేటర్ రివీల్

  |

  కొంత కాలంగా అటు బుల్లితెరపైనా.. ఇటు వెండితెరపై సందడి చేస్తూ వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది హాట్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్. చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న ఈ భామ.. దాదాపు ఐదారేళ్లుగా హవాను చూపిస్తూనే ఉంది. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. ఇక, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను తల్లి కావాలనుకుంటోన్న విషయాన్ని రివీల్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  యాంకర్ వర్షిణి రచ్చ రంబోలా.. బోల్డు లుక్‌తో హల్‌చల్ (ఫోటోలు)

  న్యూస్ ప్రజెంటర్ నుంచి యాంకర్‌గా

  న్యూస్ ప్రజెంటర్ నుంచి యాంకర్‌గా

  చిన్న వయసులోనే ‘నాగ' అనే సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది అనసూయ. ఆ తర్వాత ఈ రంగానికి దూరమైపోయింది. ఆ సమయంలోనే తన చదువును పూర్తి చేసుకుంది. మళ్లీ అవకాశాల కోసం చూస్తున్న సమయంలోనే ప్రముఖ చానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పని చేసింది. అప్పుడే హోస్టుగా కూడా కొన్ని ఈవెంట్లను చేసింది. అలా ప్రజెంటర్‌ నుంచి యాంకర్‌గా మారింది.

  ప్రియమణి బోల్డ్ అండ్ బ్యూటీపుల్ గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని ఫోటోలు

  జబర్ధస్త్‌గా మారిన అనసూయ కెరీర్

  జబర్ధస్త్‌గా మారిన అనసూయ కెరీర్

  పలు ఈవెంట్లను హోస్ట్ చేస్తున్న సమయంలోనే అనసూయకు ‘జబర్ధస్త్' షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. అలా ఆమె యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆరంభంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకున్న ఆమె.. అదిరిపోయే అందంతో అందరినీ తన వైపునకు తిప్పుకుంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను అందుకుంటూ వచ్చింది.

  యామిని భరద్వాజ్ హోమ్లీ ఫోటోషూట్.. సంప్రదాయ పద్దతిలో మరింత అందంగా

  సినిమాల్లోనూ సక్సెస్‌ఫుల్ జర్నీనే

  సినిమాల్లోనూ సక్సెస్‌ఫుల్ జర్నీనే

  యాంకరింగ్ రంగంలో తనదైన శైలి హోస్టింగ్‌తో మైమరపించింది అనసూయ. అదే సమయంలో ‘సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో నటిగా మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందామె. రంగమ్మత్త పాత్ర హైలైట్ అయింది.

  బిగ్‌బాస్ బ్యూటీ భాను శ్రీ అందాల విందు.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

  వరుస ఆఫర్లతో దూసుకుపోతోందిగా

  వరుస ఆఫర్లతో దూసుకుపోతోందిగా

  ఇంత కాలం బుల్లితెరపైనే తన ఫోకస్‌ను పెట్టిన అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు వెండితెరపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘థ్యాంక్యూ బ్రదర్' రిలీజ్ అయింది. ‘రంగమార్తాండ' విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు ‘వేదాంతం రాఘవయ్య', ‘ఖిలాడీ', ‘హరిహర వీరమల్లు', ‘పుష్ప' సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోంది.

  ఎద అందాలతో రచ్చ చేస్తున్న డైరెక్టర్ క్రిష్ హీరోయిన్.. మీరు ఎప్పుడూ చూడని అరుదైన ఫోటోలు

  అందులో బిజీగా.. ట్రోల్స్‌ లేక్కలేదు

  అందులో బిజీగా.. ట్రోల్స్‌ లేక్కలేదు

  ఇండస్ట్రీలోకి రాకముందే అనసూయ.. శశాంక్ భరద్వాజ్‌ను వివాహం చేసుకుంది. అంతేకాదు, ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాతనే కెరీర్‌ను ఆరంభించింది. ఏజ్ బారైనా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తరచూ పొట్టి బట్టలు ధరించి కనిపిస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. వీటి వల్ల ట్రోల్స్ వచ్చిన లెక్క చేయడం లేదు.

  గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ అను

  గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ అను

  అనసూయ భరద్వాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను గురించి వెల్లడించింది. అదే సమయంలో తన పర్సనల్ మేటర్లను కూడా రివీల్ చేసింది. ఇందులో భాగంగానే త్వరలోనే తాను మరోసారి తల్లిని కావాలనుకుంటోన్న విషయాన్ని బయట పెట్టింది. అందుకోసం ప్రత్యేకమైన ప్లాన్ కూడా ఉందని చెప్పుకొచ్చిందామె.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  తన కోసమే టైం కేటాయిస్తానంటూ

  తన కోసమే టైం కేటాయిస్తానంటూ

  ఆ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పుడు 35 ఏళ్లు. 40 సంవత్సరాలు వచ్చాక మరోసారి తల్లిని అవ్వాలని అనుకుంటున్నా. ఈ సారి నాకు పాపే కావాలి. తన కోసం నా సమయాన్నంతా కేటాయిస్తాను. అయితే, పిల్లల్ని కనడం వరకే మన పని.. ఎవరిని ఇవ్వాలో అది దేవుడు చూసుకుంటాడు' అంటూ తన మనసులోని కోరికను ఇలా బయట పెట్టేసిందామె.

  English summary
  In a recent interview, Hot Anchor Anasuya Bharadwaj told she will be a mother again.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X