డబ్బులు ఇచ్చి ట్రోల్ చేశారు.. నా గుండె పగిలిపోయింది.. విజయ్ దేవరకొండ వివాదంపై ఘాటుగా అనసూయ

నూతన దర్శకుడు శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌ బ్యానర్లపై కిర‌ణ్ కొర్ర‌పాటి, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం విమానం. ఈ చిత్రంలో సముద్రఖని, మాస్టర్ ధృవన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్సాన్స్ వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండతో ఉన్న వివాదంపై అనసూయ సమాధానం ఇస్తూ..

కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండకు, అనసూయ భరద్వాజ్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. ఇటీవల ఖుషీ సినిమా పోస్టర్‌పై ది విజయ్ దేవరకొండ అని రాసుకోవడంపై అనసూయ సెటైర్ వేశారు. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. అంటీ అంటూ నోటికి చెప్పలేని విధంగా కామెంట్లు వదిలి ట్రోల్ చేశారు. చివరకు ఇక ఈ వివాదం గురించి మాట్లాడను అంటూ అనసూయ కామెంట్ చేశారు.

 Anasuya Bharadwaj

విజయ్ దేవరకొండ వివాదంపై నేను ఉన్నది ఉన్నట్టు చెబితే మీరు రాస్తారని అనుకొంటాను. కానీ నేను మాట్లాడిన దానికి పరమార్థాలు తీస్తూ రాస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ గురించి ఇక ప్రస్తావించను అని సోషల్ మీడియాలో చెప్పాను. అది నేను నా మనశ్శాంతి కోసమే ఆ నిర్ణయం తీసుకొన్నాను. ఆ చెప్పిన మాటలు నిజమే. విమానం ప్రమోషన్‌లో భాగంగా ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను అని అనసూయ అన్నారు.

 Anasuya Bharadwaj

నేను తల్లిగా, మహిళగా రకరకాల పోరాటాలు చేస్తుంటాను. ఇతరుల మెప్పు పొందడానికే అందరిలానే నేను ప్రయత్నిస్తాను. అలాంటి ప్రయత్నంలో సోషల్ మీడియాలో చేసే దాడిని తట్టుకోవడం కష్టం. అది కూడా డబ్బులు ఇచ్చి చేయించారనే విషయం తెలిసిన తర్వాత నేను దిగ్బ్రాంతికి గురయ్యాను. నా గుండె పగిలినంత పనైంది. దాంతో కావాలనే నేను ఆ ట్వీట్లు చేశాను అని అనసూయ చెప్పారు.

 Anasuya Bharadwaj

నేను విజయ్ దేవరకొండకు ఫోన్ చేయాలని ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. నాకు పీఆర్ టీమ్ లేదు. నా తరఫున మాట్లాడేవాళ్లు లేరు. అందుకే నేను నేరుగా ఉన్నదున్నట్టు మాట్లాడుతాను. నేను ఎలా ఉంటానో మీకు కూడా తెలుసు. ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పలేను అని అనసూయ చెప్పారు.

ఇదిలా ఉండగా, విమానం చిత్రంలో అనసూయ పోషించిన వేశ్య పాత్ర సుమతికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. విమర్శకుల ప్రశంసలతోపాటు సాధారణ ప్రేక్షకుల అభిమానం వెల్లువెత్తుతున్నది. రంగస్థలం, పుష్ప సినిమాల తర్వాత మరో మంచి పాత్రతో విమానం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X