For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్యాంప్‌లోనే మొత్తం జరిగిపోయింది.. అది తెలిసి ఇంట్లోంచి గెంటేశారు: అనసూయ పర్సనల్ మేటర్ లీక్

  |

  అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ కొన్నేళ్లుగా బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా సందడి చేస్తూ దూసుకెళ్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన హావభావాలు పలికించగల టాలెంట్ ఉన్న ఈమె.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఫలితంగా సినిమాలు, టీవీ షోలు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ మేటర్‌ను లీక్ చేసింది అనసూయ. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu

  ఆర్తి వెంకటేష్ బ్యూటీఫుల్ ఫోటోలు.. వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

   అప్పుడే మొదలైన కెరీర్.. తర్వాత అలా

  అప్పుడే మొదలైన కెరీర్.. తర్వాత అలా

  ఎన్టీఆర్ నటించిన ‘నాగ' సినిమాలో తళుక్కున మెరిసింది అనసూయ. ఆ తర్వాత చదువు మీద దృష్టి సారించిన ఆమె ఎంబీయేను పూర్తి చేసింది. ఆ తర్వాత మరోసారి ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు సాగించింది. సరిగ్గా అప్పుడే ఓ ప్రముఖ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పని చేసింది. ఆ తర్వాత కొన్ని ఈవెంట్లను హోస్టింగ్ కూడా చేసింది. అలా కెరీర్‌ను చక్కగా మొదలెట్టింది.

   జబర్ధస్త్‌లోకి ఎంట్రీతో... మొత్తం మారింది

  జబర్ధస్త్‌లోకి ఎంట్రీతో... మొత్తం మారింది

  న్యూస్ ప్రజెంటర్‌గా చేస్తోన్న సమయంలోనే అనసూయ జబర్ధస్త్ షోలో యాంకర్‌ పరిచయం అయింది. మొదటి ప్రయత్నమే అయినా.. అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుందామె. దీనికితోడు అందం కూడా ఉండడంతో తెలుగు ప్రేక్షకుల చూపును తన వైపునకు తిప్పుకుంది. దీంతో ఈమెకు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చేసింది. ఫలితంగా వరుస ఆఫర్లు అందుకుని స్టార్‌గా మారిపోయిందామె.

   సినిమాల్లోనూ సత్తా.. రంగమ్మత్తకు క్రేజ్

  సినిమాల్లోనూ సత్తా.. రంగమ్మత్తకు క్రేజ్

  బుల్లితెరపై ఎన్నో షోలలో పని చేసిన అనసూయ సినిమాల్లోనూ సత్తా చాటింది. ‘నాగ' వచ్చిన దాదాపు పదమూడేళ్ల తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో నటిగా మరోసారి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందామె. ఆమె చేసిన అన్నింట్లోనూ రంగమ్మత్త పాత్ర హైలైట్ అనొచ్చు.

  అన్నీంట్లోనూ అనసూయనే కనిపిస్తోంది

  అన్నీంట్లోనూ అనసూయనే కనిపిస్తోంది

  చాలా కాలం పాటు బుల్లితెరపైనే ఎక్కువగా కనిపించిన అనసూయ.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించేందుకు మక్కువ చూపిస్తోంది. ఇందులో భాగంగానే వరుస సినిమాలను లైన్‌లో పెడుతోంది. ఇప్పటికే ‘థ్యాంక్యూ బ్రదర్' రిలీజ్ అయింది. ‘రంగమార్తాండ' రెడీగా ఉంది. ఇక, ‘వేదాంతం రాఘవయ్య', ‘ఖిలాడీ', ‘హరిహర వీరమల్లు', ‘పుష్ప' సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేస్తోంది.

  పర్సనల్ మేటర్ లీక్ చేసిన అనసూయ

  పర్సనల్ మేటర్ లీక్ చేసిన అనసూయ

  రెండు రోజుల క్రితమే పుట్టినరోజును జరుపుకున్న అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ట్విట్టర్‌లో ఏకంగా నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కనిపించింది. అదే సమయంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా హైలైట్ అవుతోంది. ఇక, ఇందులో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు ఓ పర్సనల్ మేటర్‌ను కూడా రివీల్ చేసేసింది అనసూయ భరద్వాజ్.

  క్యాంప్‌లోనే మొత్తం జరిగిపోయిందంటూ

  క్యాంప్‌లోనే మొత్తం జరిగిపోయిందంటూ

  తాజా ఇంటర్వ్యూలో అనసూయ భరద్వాజ్ తన ప్రేమ కథ గురించి వెల్లడించింది. ‘నేను చదువుకునే రోజుల్లో శశాంక్ ఎన్‌సీసీ క్యాంప్‌లో పరిచయం అయ్యాడు. అప్పుడే అతడు నాకు ప్రపోజ్ చేశాడు. ఆయన అడిగిన విధానం.. నాతో మాట్లాడిన తీరు అన్నీ నాకు బాగా నచ్చేశాయి. దీంతో వెంటనే ఓకే చెప్పేశాను. అప్పటి నుంచి చాలా రోజులు మా ప్రేమాయణం సాగింది' అని చెప్పుకొచ్చింది.

   అది తెలిసి ఇంట్లోంచి గెంటేశారని రివీల్

  అది తెలిసి ఇంట్లోంచి గెంటేశారని రివీల్

  తన ప్రేమ కథ ఇంట్లో తెలిసిన తర్వాత కష్టాలు ఎదురయ్యాయని అనసూయ చెప్పింది. ‘మా లవ్ గురించి ఇంట్లో తెలిసి నన్ను బయటకు గెంటేశారు. అప్పుడే న్యూస్ ఛానెల్‌లో జాబ్ చేశా. ఆ సమయంలో ఓ స్లమ్‌లో అద్దెకు ఉండేదాన్ని. అప్పుడు చాలా కష్టాలు అనుభవించా. శశాంక్‌ను వివాహం చేసుకున్న తర్వాత అవన్నీ మర్చిపోయాను' అంటూ వివరించిందీ హాట్ యాంకర్.

  English summary
  In a recent interview, Hot Anchor Anasuya Bharadwaj Reveal her Love Story and Struggles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X