వేశ్యగా చేస్తే బోల్ట్ అంటారా? పెద కాపులో అలా నటించానా? అంటే.. అనసూయ షాకింగ్ కామెంట్స్

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 'అఖండ'ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా పెద్ద కాపు-1. ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్న అనసూయ మీడియాతో మాట్లాడుతూ..

నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నానా?
పెదకాపు సినిమాలో నాది కీలకమైన పాత్ర. అయితే నాది పాజిటివ్ రోలా? లేదా నెగిటివ్ రోలా? అనేది నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడే చెబితే మజా ఉండదు. సినిమాలో చూస్తే మీకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. రంగమ్మత్త రోల్ చేసిన తర్వాత నాపై అంచనాలు పెరిగాయి. రంగమ్మత్త పాత్రకు ముందు అలాంటి అంచనాలు లేవు. ఆ పాత్ర సినీ ప్రేక్షకులకు ఓ సర్‌పైజ్‌గా అనిపించింది. అందుకే ఈ పాత్రను ఇంకా గుర్తుంచుకొన్నారు అని అనసూయ అన్నారు.

 Anasuya Bharadwaj

విమానంలో సుమతి పాత్ర
నేను ఏ సినిమా చేసినా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయాలని అనుకొంటాను. విమానంలో సుమతి పాత్ర కూడా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. పెదకాపు సినిమాలో నేను చేసిన పాత్ర పేరుతోపాటు, ఆ రోల్‌ గురించి ఎక్కువగా మాట్లాడుకొంటారు. లుక్ పరంగా, క్యారెక్టర్ పరంగా మిమ్మల్ని ఆకట్టుకొంటుంది. గ్రామీణ కథా నేపథ్యంతో సాగే పాత్ర మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ అని అనసూయ భరద్వాజ్ చెప్పారు.

 Anasuya Bharadwaj reveals her bold charachter

చోటా కే నాయుడు ఫోన్ చేసి..
పెదకాపు సినిమా 70, 80 దశకంలో సాగే కథ. భాష మార్పు ఏమీ లేదు. మైఖేల్ మూవీలో నా పాత్రను చూసిన తర్వాత నాకు సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఫోన్ చేశారు. మీకు శ్రీకాంత్ నుంచి ఫోన్ వస్తుంది. మంచి క్యారెక్టర్. కథ విని ఒప్పుకోమని చెప్పను. కానీ చేయడానికి ప్రయత్నించమని చెప్పారు. చోటా కే నాయుడు చెప్పడం, శ్రీకాంత్ సినిమాలో నటించాలనే కోరిక, కథ విన్న తర్వాత తప్పకుండా చేయాలని నిర్ణయించుకొన్నాను. ఈశ్వరి, ప్రగడ, నా క్యారెక్టర్ చాలా బలంగా ఉంటాయి అని అనసూయ భరద్వాజ్ చెప్పారు.

వేశ్యగా చేస్తే బోల్డా?
పెదకాపు సినిమాలో నా క్యారెక్టర్ బోల్డ్‌గా ఉంటుందని చెప్పలేను. బోల్డ్ అనేది ప్రదేశాన్ని, పరిస్థితులను బట్టి మారిపోతుంది. కాబట్టి ఇదే బోల్డ్ అని చెప్పలేను. నేను బీహార్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో పెళ్లి చేసుకొన్నాను. అక్కడికి వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలు, సంప్రదాయలు పాటిస్తున్నాను. బోల్డ్‌నెస్ అనేది క్యారెక్టర్‌ను బట్టి మారుతుంది అని అనసూయ అన్నారు.

 Anasuya Bharadwaj reveals her bold charachter in the Peda Kapu 1 movie

వేశ్య పాత్ర బోల్డ్ అనను..
వేశ్య పాత్ర బోల్డ్ అనుకోను. ఫిల్మ్ మేకర్ చెప్పే మంచి కథలో భాగం కావాలని అనుకొంటాను. స్టోరిని మలుపు తిప్పే పాత్ర ఉంటే నటించడానికి ప్రయత్నిస్తాను. పెదకాపు సినిమాలో అలాంటి పాత్రలో కనిపిస్తాను. డైలాగ్స్‌లో బోల్ట్ కంటెంట్ ఉంటుంది అని అనసూయ భరద్వాజ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X