ఆయనకు అలాంటి అలవాట్లు.. అందుకే సర్వస్వం కోల్పోవాల్సి వచ్చింది: అనసూయ సెన్సేషనల్ కామెంట్స్

కొంత కాలంగా తెలుగు బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపైనా తన సత్తాను నిరూపించుకుంటూ హవాను చూపిస్తోంది గ్లామరస్ క్వీన్ అనసూయ భరద్వాజ్. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే అనసూయ భరద్వాజ్ తన తండ్రి అలవాట్లు.. ఆస్తులు గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

ఎద అందాలు ప్రదర్శిస్తున్న సాక్షి అగర్వాల్.. యువ హీరోయిన్ ఆ విషయంలో తగ్గట్లేదే

అలా మొదలైన అనసూయ కెరీర్

అలా మొదలైన అనసూయ కెరీర్

నటిగా రాణించాలన్న పట్టుదలతో సినీ రంగం వైపు అడుగులు వేసింది అనసూయ భరద్వాజ్. ఆ సమయంలోనే అవకాశాలు అంతగా దొరకలేదు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాగ' అనే సినిమాలో చిన్న పాత్రను పోషించడం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందామె. ఆ తర్వాత అనసూయ ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో చాలా కాలం పాటు ప్రజెంటర్‌గా పని చేసింది.

మరీ హాట్‌గా పార్వతీ నాయర్.. రెచ్చిపోయి ఫోటోషూట్

ఒకే ఒక్క షో జీవితాన్ని మార్చింది

ఒకే ఒక్క షో జీవితాన్ని మార్చింది

న్యూస్ ఛానెల్‌లో పని చేస్తోన్న సమయంలోనే అనసూయకు 'జబర్ధస్త్' షో ఆఫర్ వచ్చింది. దీని ద్వారానే ఆమె యాంకర్‌గా పరిచయం అయింది. అప్పటి వరకూ ఓ పంథాలో సాగుతోన్న యాంకరింగ్ రంగానికి గ్లామరస్ టచ్ ఇచ్చింది. దీంతో తెలుగు అమ్మాయిలకు ఓ మార్గాన్ని చూపించింది. తద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు వరుస ఆఫర్లను కూడా అందుకుందీ బ్యూటీ.

బికినీలో రాయ్ లక్ష్మీ.. బీచ్‌లో బర్త్ డే బేబీ హల్‌చల్.. రత్తాలు రేర్ ఫోటోలు

అక్కడ కూడా సూపర్ సక్సెస్‌ఫుల్

అక్కడ కూడా సూపర్ సక్సెస్‌ఫుల్

యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను అందుకుని సత్తా చాటిన అనసూయ.. వెండితెరపైనా తన మార్క్ చూపించింది. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన'తో నటిగా మారిన ఆమె.. ఇందులో కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకుంది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందామె.

యాంకర్ వర్షిణి సౌందర్‌రాజన్ గ్లామరస్ ఫోటోలు.. అందాల ఆరబోతతో హంగామా (ఫోటోలు)

టాలీవుడ్‌లో అనసూయదే హవా

టాలీవుడ్‌లో అనసూయదే హవా

అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ', 'థ్యాంక్యూ బ్రదర్'లో నటించింది. ఇవి విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. వీటితో పాటు పవన్ 'హరిహర వీరమల్లు'.. అల్లు అర్జున్ 'పుష్ప'లోనూ నటిస్తోంది.

మాళవిక మోహనన్ క్లీవేజ్ షో.. మాస్టర్ హీరోయిన్ హాట్ ఫోటో గ్యాలరీ..

ఎప్పుడూ అందులోనే.. ట్రోల్స్‌తో

ఎప్పుడూ అందులోనే.. ట్రోల్స్‌తో

అనసూయ ఇండస్ట్రీలోకి రాకముందే శశాంక్ భరద్వాజ్‌ను వివాహం చేసుకుంది. అంతేకాదు, ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాతనే కెరీర్‌ను ఆరంభించింది. ఏజ్ బారైనా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తరచూ పొట్టి బట్టలు ధరించి కనిపిస్తుంది. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. తద్వారా నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది.

ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు

ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు

'థ్యాంక్యూ బ్రదర్' విడుదల అవుతోన్న సందర్భంగా అనసూయ భరద్వాజ్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను రివీల్ చేసింది. 'మాకు మొదట్లో చాలా ఆస్తులు ఉండేవి. మా ఇంట్లో గుర్రాలు కూడా ఉండేవి. కానీ, ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదు' అంటూ వెల్లడించింది అనసూయ.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
ఆయనకు అలాంటి అలవాట్లంటూ

ఆయనకు అలాంటి అలవాట్లంటూ

ఆ ఆస్తులన్నీ పోడానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది అనసూయ. 'మా నాన్న గారికి గుర్రపు స్వారీలు, గ్యాబ్లింగ్ వంటి చెడు అలవాట్లు ఉండేవి. ఆ అలవాట్ల వల్ల ఆస్తులన్నీ కోల్పోవలసి వచ్చింది. దీంతో మా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కో రోజు డబ్బులు లేకపోవడంతో బస్సు ఎక్కకుండా నడుచుకుంటూ కాలేజ్‌కు వెళ్లేదాన్ని' అని ఈ యాంకర్ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X