For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ పనులు చేయబట్టే ఇండస్ట్రీలో ఉన్నావ్ అన్నాడు.. మెడిసిన్ ఇచ్చేసరికి అలా: అనసూయ సంచలన వ్యాఖ్యలు

  |

  రంగుల ప్రపంచంలో రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు. అద్భుతమైన టాలెంట్ కూడా ఉండాలి. జనాలను మెప్పించే విధానం తెలియాలి. ఆకట్టుకోగలిగే వాక్చాతుర్యం ఉండాలి. అన్నింటికీ మించి అప్పటికప్పుడు స్పందించగల నైపుణ్యం ఉండాలి. ఇలా అన్నింటిలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సత్తా చాటుతోన్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. చాలా కాలంగా తన హవాను చూపిస్తోన్న ఈమె.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన చేదు ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

  న్యూస్ ప్రజెంటర్ నుంచి యాంకర్‌గా ప్రవేశం

  న్యూస్ ప్రజెంటర్ నుంచి యాంకర్‌గా ప్రవేశం

  కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో నటించినా అనసూయకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ సమయంలోనే ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. అందులో తన టాలెంట్‌తో మెప్పించింది. ఆ సమయంలోనే జబర్ధస్త్ షోలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఎప్పుడైతే అందులో అడుగు పెట్టిందో.. అప్పటి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి.

  పెళ్లైనా అందరి కళ్లూ ఆమె మీదే పడేంతగా

  పెళ్లైనా అందరి కళ్లూ ఆమె మీదే పడేంతగా

  అనసూయ ఇండస్ట్రీలోకి రాకముందే శశాంక్ భరద్వాజ్‌ను వివాహం చేసుకుంది. అంతేకాదు, ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాతనే కెరీర్‌ను ఆరంభించింది. ఈ విషయం చాలా మందికి తెలుసు. అయినప్పటికీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆమెను తమ క్రష్‌గా ఫిక్స్ అయిపోయారు. ఈ అందానికి చాలా మంది ఫిదా అయిపోయారు. దీంతో ఆమెను ఎనలేని క్రేజ్ వచ్చేసింది.

  అనన్య నాగళ్ల లవ్లీ లుక్స్.. వకీల్‌సాబ్ చిత్రంతో మరో రేంజ్‌కు మల్లేశం హీరోయిన్

  సినిమాల్లోనూ సత్తా.. అన్నింట్లోనూ అదుర్స్

  సినిమాల్లోనూ సత్తా.. అన్నింట్లోనూ అదుర్స్

  అద్భుతమైన హోస్టింగ్‌తో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోన్న అనసూయ భరద్వాజ్.. ‘సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. వీటన్నింటిలోనూ అత్యద్భుతమైన నటనను కనబరిచి అదుర్స్ అనిపించుకుంటూ ప్రశంసలు అందుకుంది.

  అందరి చాయిస్ ఆమె... ఇప్పుడు ఫుల్ బిజీ

  అందరి చాయిస్ ఆమె... ఇప్పుడు ఫుల్ బిజీ

  ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి నటిస్తుంది అనసూయ. అందుకే ఫిల్మ్ మేకర్ల ఫస్ట్ చాయిస్‌గా మారిపోయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ', ‘థ్యాంక్యూ బ్రదర్'లో నటిస్తోంది. అలాగే సునీల్ ‘వేదాంతం రాఘవయ్య', రవితేజ ‘ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. అలాగే, పవన్ - క్రిష్ సినిమాలోనూ నటిస్తోందీ అమ్మడు.

  ఎప్పుడూ అందులోనే... ట్రోల్స్... కౌంటర్లతో

  ఎప్పుడూ అందులోనే... ట్రోల్స్... కౌంటర్లతో

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది అనసూయ భరద్వాజ్. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. ఈ క్రమంలోనే ఆమె నెటిజన్ల నుంచి ట్రోల్స్‌కు గురవుతోంది. వాటికి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తోంది.

  పడుకోబట్టే ఇండస్ట్రీలో ఉన్నావ్ అన్నాడతను

  పడుకోబట్టే ఇండస్ట్రీలో ఉన్నావ్ అన్నాడతను

  తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటనను వివరించింది. ‘కొద్ది రోజుల క్రితం ఒకడు.. నువ్వు పడుకోబట్టే ఇండస్ట్రీలోకి వచ్చావ్.. నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే కారణం అదే కదా అని కామెంట్ చేశాడు. నిజానికి నేను ఇవన్నీ పట్టించుకోను. కానీ, దానిపై రియాక్ట్ అవ్వాలని అనుకున్నా' అంటూ చెప్పుకొచ్చిందామె.

  మెడిసిన్ ఇచ్చే సరికి.. అదే ఫార్ములాతో ఇలా

  మెడిసిన్ ఇచ్చే సరికి.. అదే ఫార్ములాతో ఇలా

  అనసూయ భరద్వాజ్ దానిని కొనసాగిస్తూ.. ‘ఆ నెటిజన్ చేసిన కామెంట్‌కు మీ ఇంట్లో వాళ్లూ అంతేనా అని రిప్లై ఇచ్చా. దెబ్బకు వాడు కామెంట్‌ను డిలీట్ చేసేశాడు. అప్పటి నుంచి ఇలాంటి కామెంట్లతో మెడిసిన్ ఇస్తేనే ట్రోల్స్ ఆపుతారని డిసైడ్ అయ్యా. అందుకే అదే తరహాలో కౌంటర్లు ఇస్తున్నా. రాను రానూ అవన్నీ పట్టించుకోవడమే మానేశాను' అంటూ చెప్పుకొచ్చిందీ యాంకర్.

  English summary
  Anasuya Bharadwaj is an Indian television presenter and actress. As an actress she has worked predominantly in Telugu cinema and Telugu television shows. She received the IIFA Award for Best Performance In A Supporting Role – Female in 2017, for her role in Kshanam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X