అనసూయ ఎందుకిలా చేస్తోంది.. యాంకర్ వైఖరిపై అనుమానాలు
Recommended Video
టాలీవుడ్ యాక్టర్ కమ్ యాంకర్ అనసూయ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరిది. బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్న ఆమె.. బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు టీవీ షోలు చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె నటించిన తాజా చిత్రం 'కథనం'. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనసూయతో పాటు చిత్ర యూనిట్ చేస్తున్న పనితో ఇండస్ట్రీలో సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

అస్సలు ఊహించలేదు
నాగార్జున సినిమాతో పాటే తన సినిమా కూడా విడుదలవుతుండడంతో అనసూయ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రోడ్డు మీద వెళ్తుంటే నాగ్ సార్ సినిమా పోస్టర్.. పక్కనే నా సినిమా పోస్టర్.. మళ్లీ నాగ్ సారి పోస్టర్.. తర్వాత నా పోస్టర్.. ఇలా సార్ పక్కన నా పోస్టర్ ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. అలాంటి పోస్టర్ చూడాల్సి వస్తుందని కూడా ఊహించలేదు' అని చెప్పుకొచ్చింది.

నాగ్ సారంటే ఇష్టం
‘మన్మథుడు 2' విడుదలవుతున్న రోజునే ‘కథనం' వస్తుండడంపైనా ఆ ఈవెంట్‌లో అనుసూయ కామెంట్స్ చేసింది. ‘మీ అందరికీ తెలుసు నాగ్ సార్ అంటే నాకు ఇష్టం. ఆయన సినిమా రోజే మాది రావడం అనుకుని చేసింది కాదు. కాబట్టి మీకు ఏ సినిమా చూడాలనుకుంటే అది చూడండి' అని ఆమె పేర్కొంది.

ఇప్పుడేమో సైలెంట్
సినిమా విడుదల దగ్గరైనా అనసూయ చిత్ర ప్రమోషన్‌పై దృష్టి పెట్టలేదనే కామెంట్ వినిపిస్తోంది. ఒకవైపు, ‘మన్మథుడు 2' యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుపుతుంటే.. ‘కథనం' బృందం మాత్రం సైలెంట్‌గా ఉంది. ఒక్క ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌తో ఆపేయడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అనసూయ కాన్ఫిడెన్స్
ప్రమోషన్ చేయకపోవడానికి అనసూయ టీమ్ తమ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉండడమే కారణం అని తెలుస్తోంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథతో వస్తుండడంతో అదే తమను గట్టెక్కిస్తుందని అనుకుంటున్నారట. ఈ సినిమాపై ఉన్న నమ్మకం వల్లే నాగార్జున సినిమా ఉన్నా అదే రోజు విడుదల చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

‘కథనం' గురించి..
అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం'. ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బీ నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించిన ఈ సినిమాను రాజేష్ నాదెండ్ల తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అనసూయతో పాటు వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











