Anasuya Bharadwaj ఎర్ర చీర.. మల్లెపూలు.. గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన రంగమ్మత్త
బుల్లితెరపై అందమైన యాంకర్ ఎవరు అని అడిగితే.. అందరూ అనసూయ పేరు చెబుతారు. అందమే అసూయ పడేలాంటి అందం అనసూయకు సొంతం. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా రోజురోజుకూ అనసూయ అందం పెరుగుతూనే వస్తోంది. ఆమె క్రేజ్, ఫాలోయింగ్ అంతా కూడా వయసుతో పాటు పెరుగుతూనే పోతోంది. ఇక ఆమె చుట్టూ వివాదాలు కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

జబర్దస్త్ బ్యూటీగా షోకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా
అనసూయ తన కెరీర్‌ను న్యూస్ యాంకర్‌గా మొదలుపెట్టేసింది. అక్కడి నుంచి జబర్దస్త్ యాంకర్‌గా మారింది. దాంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అనసూయ అందాలను చూసేందుకే మొదట్లో జబర్దస్త్ షోను చూసిన వారు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్ యాంకర్‌గా మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది.

జబర్దస్త్‌లో కీలకంగా
జబర్దస్త్ షోను ముందు ఓ 25 ఎపిసోడ్‌లు అనసూయ చేసినట్టుంది. ఆ తరువాత కొన్ని పర్సనల్ కారణాలతో షో నుంచి బయటకు వచ్చింది. ఆ తరువాత రెండు మూడేళ్లకు మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే అనసూయ స్థానంలో రష్మీ అదరగొట్టేస్తూ ఉంది. అలా మొత్తానికి మళ్లీ జబర్దస్త్ యాంకర్‌గా తన స్థానాన్ని కాపాడుకుంది.

కాంట్రవర్సీలతో రంగమ్మత్త
అనసూయ ట్వీట్లు, పోస్టులు, హాట్ ఫోటో షూట్లూ ఇలా అన్నీ కూడా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. నెటిజన్లు ఏవో నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. వాటికి ఘాటుగా రిప్లై ఇస్తూ అనసూయ మరింత హీటు పెంచుతూ ఉంటుంది. అలా అనసూయ ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అనసూయకు మల్లెమాలకు మధ్య గ్యాప్ వచ్చిందని, అందుకే జబర్దస్త్ షోను కాదని, స్టార్ మాలోని సింగింగ్ షోకు హోస్ట్‌గా వెళ్లిందని నెటిజన్లు అంటుంటారు. కారణాలు స్పష్టంగా చెప్పలేదు కానీ జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకుంటున్నానని, సపోర్ట్ చేయాలంటూ పరోక్షంగా చెప్పింది అనసూయ.

ఎప్పుడూ నటిస్తూనే..
24 గంటలు కొందరూ నటిస్తూనే ఉంటారు.. ఆన్ సెట్‌లోనే కాకుండా.. ఆఫ్ సెట్‌లో కూడా అలా ఎలా నటిస్తుంటారు అని ఆశ్చర్యపోతుంటాను.. ఆ ఆలోచన కూడా నాకు వస్తుంటే.. ఏదో అయిపోతోంది అని.. ఎవరో గురించి కానీ ఇలా పరోక్షంగా అనసూయ సెటైర్లు వేసింది.

లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్
ఇదిలా ఉండగా, ఇటీవల అనసూయ చేసిన ఫోటోషూట్ వైరల్ అయింది. ఎరుపు రంగు చీరెలో. డిజైనర్ జాకెట్‌లో మెరిసింది. అలాగే పక్కాగా తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా తలలో మల్లెపూలు పెట్టుకొని తెలుగు ఆడపడచులా కనిపించింది. ఎప్పుడూ మోడరన్ డ్రస్సులో అలరించే అనసూయ తాజాగా కనిపించిన అవతారంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Recommended Video


అనసూయ సినిమా కెరీర్ దర్జాగా
ఇక అనసూయ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. రంగస్థలం సినిమా తర్వాత కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా మారిపోయింది. థ్యాంక్యూ యూ బ్రదర్, పుష్ప: ది రైజ్ చిత్రాలు ఆమెను నటిగా మరింత ఎత్తుకు ఎదిగింది. ఇటీవల వచ్చిన దర్జా చిత్రంలో నెగిటివ్ పాత్రలో అద్బుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











