Sivaji Vs Anasuya Bharadwaj: ఎవడ్రా ఆంటీ.. రెచ్చిపోయిన అనసూయ

Sivaji Vs Anasuya Bharadwaj: టాలీవుడ్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ (Sivaji) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు నటీమణులు స్పందించగా, తాజాగా యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి స్పందించింది. వరుస ట్విట్స్ తో శివాజీకి చుక్కులు చూపిస్తుంది. ప్రస్తుతం ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన వయసును టార్గెట్ చేస్తూ 'ఆంటీ' అంటూ చేస్తున్న ట్రోలింగ్‌పై అనసూయ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో అనసూయ తీవ్రంగా స్పందించారు. కొంతమంది పురుషులు మాత్రమే కాదు, కొందరు మహిళలు కూడా తన వయసును అడ్డం పెట్టుకుని తనను తక్కువగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా స్వతంత్రంగా, ప్రగతిశీలంగా ముందుకు సాగుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకుంటాయని అన్నారు. మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయమే దీనికి మూలకారణమని, ఇది పితృస్వామ్య అహంకారానికి నిదర్శనమని అనసూయ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Anasuya Bharadwaj Slams Aunty Trolls Strong Counter to Shivaji Comments Goes Viral

మహిళల డ్రెస్సింగ్ గురించి మాట్లాడే అర్హత ఎవరి లేదనీ, ఇలానే డ్రెస్సింగ్ వేసుకోవాలని ఎక్కడ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు.. తరతరాల నుంచి అలవాటుపడ్డ పాతకాలపు ఆలోచనలను యథాతథంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అనసూయ హితవు పలికారు. సమాజంగా మనం మార్పును ఎంచుకోవాలని, ఒకరికొకరం మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ తరహా వివాదాలను గ్లోరిఫై చేస్తూ చూపిస్తున్న కొన్ని మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూడా ఆమె సూచించారు.

'ఆంటీ' అంటూ జరుగుతున్న ఏజ్ షేమింగ్‌పై అనసూయ మరింత సూటిగా స్పందించారు. 'ఉన్న సమస్యను అడ్రస్ చేయలేక నన్ను ఆంటీ అంటున్నారు. కానీ ఆయన్ని మాత్రం 'గారు' అంటున్నారు. ఇందులో ఉన్న హిపోక్రసీ ఏంటో అర్థం కావడం లేదు' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. తన వయసును కూడా బహిరంగంగా వెల్లడిస్తూ.. 'నాకు 40 ఏళ్లు. ఆయనకు 54 ఏళ్లు అనుకుంటా.. అయినా మేమిద్దరం మా వృత్తి కోసం ఫిట్‌నెస్, గ్లామర్ మైంటైన్ చేస్తున్నాం' అని చెప్పారు. విమర్శలు చేసే వాళ్లంతా నిత్య యవ్వనులు అన్నట్లుగా సెటైర్లు వేశారు. ఈ అంశం హైలెట్ గా మారింది.

డ్రెస్సింగ్ అంశంపై కూడా అనసూయ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత ఎంపిక అని, అది ఎవరికీ హాని కలిగించదని చెప్పారు. 'ప్రొటెక్షన్' పేరుతో చేసే మోరల్ పోలీసింగ్ గౌరవాన్ని కాపాడదని, అది నియంత్రణగా మారుతుందని హెచ్చరించారు. నిజమైన గౌరవానికి పర్యవేక్షణ అవసరం లేదని తేల్చిచెప్పారు. చివరగా.. 'మీ కుళ్లును మీరు అలాగే ఉంచండి. మా జల్వా మేము చూపిస్తూనే ఉంటాం'అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

ఎన్ని విమర్శలు వచ్చినా తాను ప్రభావితం కాబోనని, ధైర్యంగా నిలబడతానని అనసూయ స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా, సమాజంలో మహిళలపై ఉండే దృక్పథం, ఏజ్ షేమింగ్, పితృస్వామ్య ఆలోచనలపై జరుగుతున్న పెద్ద చర్చగా మారింది. ఈ విషయంపై శివాజీ ఎలా స్పందిస్తారో ? అలాగే.. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి. ఇంకా ఎన్నాళ్లు ఈ వివాదం కొనసాగుతుందో వేయిట్ అండ్ సీ..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X