Anasuya On Shivaji: ‘మీ నిజస్వరూపం ఇదే.. సానుభూతి కోసమే ఈ డ్రామా' శివాజీ కామెంట్స్‌కు అనసూయ ఘాటు రిప్లై..
Anasuya Vs Shivaji: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మరోసారి నటుడు శివాజీ (Shivaji)చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. "అతివినయం దూర్త లక్షణం" అంటూ షాకింగ్ లైన్‌తో వీడియో ప్రారంభించారు. శివాజీ వ్యాఖ్యలు పెట్టిన ప్రెస్‌మీట్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?
అనసూయ వీడియోలో మాట్లాడుతూ 'మా ఇంట్లో పెద్దవాళ్లు ఒక మాట చెప్పేవారు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ల గురించి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ చాలా ప్రశాంతంగా, 'అమ్మ బుజ్జి తల్లి' అంటూ మాట్లాడేవాళ్లే చాలా డేంజర్ అని. అప్పట్లో ఎందుకు అలా అంటారో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు వస్తున్న వీడియోలు చూస్తే వాళ్లు చెప్పింది నిజమే అనిపిస్తోంది'అంటూ తన అనుభవాన్ని షేర్ చేశారు.

శివాజీ వ్యాఖ్యలపై తాను స్పందించడానికి కారణం వివరిస్తూ అనసూయ 'నేను ఓ క్లాత్ షోరూమ్ ఓపెనింగ్‌కు వెళ్లాను. అక్కడ మీడియా వాళ్లు శివాజీ కామెంట్స్ గురించి అడిగారు. ఆయన కనిపించింది, ఆయన చెప్పింది విని నాకు అనిపించింది నేను చెప్పాను. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద దాడి చేయాలనే ఉద్దేశం లేదు' అని అన్నారు. శివాజీ తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రెస్‌మీట్ పెట్టడంపై అనసూయ మరింత ఘాటుగా స్పందించారు.
'ఆ ప్రెస్‌మీట్ చూస్తే విక్టిమ్ కార్డు ప్లే చేయడానికే పెట్టినట్లు అనిపించింది. ఆ పద్ధతి చూస్తే నార్త్ సైడ్ స్టైల్‌లా ఉంది. ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఇద్దరూ కలిసే ఈ సమాజం ముందుకు వెళ్తుంది. కానీ ఆడవారి బట్టల గురించి మాట్లాడటం చేతగానితనం. అది సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే, ఇన్‌సెక్యూరిటీ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇక్కడితో ఆగని అనసూయ 'ఈరోజు కావాలని సింపతి కార్డు ప్లే చేయడానికి ట్రై చేశారు. ఆయనకు కావాల్సింది సానుభూతే. కాబట్టి నేను కూడా సానుభూతి ఇస్తున్నాను'అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. తాను కూడా హీరోయిన్‌నేనని, ఒకటి రెండు సినిమాల్లో లీడ్ రోల్స్‌లో నటించానని గుర్తు చేశారు. 'మిమ్మల్ని ఇలాంటి బట్టలు వేసుకోమని మేము ఎప్పుడైనా చెప్పామా? ఏ హీరోయిన్ అయినా మీ డ్రెస్సింగ్‌పై కామెంట్ చేసిందా? మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మా ఇష్టాల ప్రకారం జీవించడానికి మమ్మల్ని వదిలేయండి' అంటూ అనసూయ స్పష్టంగా చెప్పారు.
'మీరు డైరెక్ట్‌గా కాకపోయినా కలెక్టివ్‌గా పరోక్షంగా కామెంట్ చేశారు. నేనూ ఒక ఆడదాన్నే. గ్లామరస్‌గా, అందంగా ఉండాలని ప్రయత్నిస్తాను. నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను. నా అభిప్రాయం అడిగితే చెప్పాను' అని తెలిపారు. శివాజీ తన వ్యాఖ్యలపై ఎలా స్టాండ్ తీసుకున్నారో, తాను కూడా అలాగే స్టాండ్ తీసుకున్నానని అనసూయ స్పష్టం చేశారు. 'మీరు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అలా ఉంటే, సృష్టికర్తలమైన మేము మూర్ఖులమా? మేమందరం కలిస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి'అంటూ హెచ్చరించారు.
చివరగా అనసూయ మాట్లాడుతూ 'మరణశిక్ష లాంటి మాటలు వద్దు. బయట మీరు ఏం మాట్లాడారో అదే మీ నిజ స్వరూపం. నిజంగా ఆడవారిపై గౌరవం ఉంటే, మగవాళ్లకు చెప్పండి.. ఆమె అందంగా ఉంది, ఆమెను అభినందించండి, గౌరవించండి అని. బట్టలు ఎలా వేసుకోవాలి అని ఎక్కడ రాసి ఉంది? అసలు బట్టలే ఇక్కడ విషయం కాదు. క్యారెక్టర్, ప్రవర్తనే అసలు ముఖ్యం' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తనపై గతంలో జరిగిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ 'ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈరోజు ఇక్కడ నిల్చున్నాం. మాకు మీ సపోర్ట్ అవసరం లేదు. నా గురించి నేను చూసుకోగలను. నా చుట్టూ ఉన్నవారు నన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు'అంటూ శివాజీకి అనసూయ గట్టి కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి శివాజీ వ్యాఖ్యలపై అనసూయ చేసిన ఈ ఘాటు స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.


Click it and Unblock the Notifications











