అనసూయ నుంచి అదిరిపోయే హాట్ షో: ఆ హీరోయిన్‌కు భారీ షాకిస్తూ.. బాగానే చూపించిందిగా!

బుల్లితెరపై కొన్నేళ్లుగా అందంతో మెస్మరైజ్ చేస్తూ.. వాక్చాతుర్యంతో ఫిదా చేస్తోంది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఎంతో మంది గ్లామరస్ యాంకర్ల నుంచి పోటీ నెలకొని ఉన్నా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని చూపిస్తూ స్టార్ హోస్టుగా దూసుకుపోతోందామె. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. టెలివిజన్ రంగంలోనే కాదు.. వెండితెరపైనా తన మార్క్ చూపిస్తోందీ బ్యూటీ. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలను కూడా చేసింది. ఈ నేపథ్యంలో అదిరిపోయే హాట్ షోతో హీరోయిన్‌కే షాకిచ్చింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే....

న్యూస్ ప్రజెంటర్ నుంచి యాంకర్ వరకు

న్యూస్ ప్రజెంటర్ నుంచి యాంకర్ వరకు

సినిమాల్లో నటించాలన్న లక్ష్యంతో కెరీర్ ఆరంభించిన అనసూయకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇలాంటి సమయంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసిన ఆమె.. చాలా మంది దృష్టిలో పడింది. ఆ సమయంలోనే జబర్ధస్త్ అనే కామెడీ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తనదైన శైలి యాంకరింగ్‌కు తోడు గ్లామర్‌తో అదరగొడుతూ సత్తా చాటుతోందీ బ్యూటీ.

సినిమాల్లో ఎంట్రీ.. ఆ పాత్రతో మాయ చేసి

సినిమాల్లో ఎంట్రీ.. ఆ పాత్రతో మాయ చేసి

జబర్ధస్త్ షోలో యాంకర్‌గా చేయడం వల్ల అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చి పడ్డాయి. అదే సమయంలో సినిమాల్లోనూ ఛాన్స్‌లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'సోగ్గాడే చిన్ని నాయన', 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. వీటిలో రంగమ్మత్త పాత్రతో మాయ చేసింది అనసూయ.

అందులో స్పైసీగా.... ఇందులో గ్లామర్‌గా

అందులో స్పైసీగా.... ఇందులో గ్లామర్‌గా

బుల్లితెరపై బిజీగా గడుపుతూనే అప్పుడప్పుడూ పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఇందులో భాగంగానే ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో ఆమె స్పైసీ రోల్‌లో చేస్తున్నట్లు తెలిసింది. దీనితో పాటు పవన్ - క్రిష్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీలో ఐటం సాంగ్ కూడా చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

అనసూయ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

అనసూయ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం అనసూయ 'థ్యాంక్యూ బ్రదర్' అనే సినిమాలో నటిస్తోంది. ర‌మేష్ రాప‌ర్తి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఇందులో ఆమె గర్భిణి పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఆమె నటన చేసి అందరూ షాక్ అవుతున్నారు. దీనితో పాటు సునీల్ హీరోగా నటిస్తోన్న 'వేదాంతం రాఘవయ్య' అనే సినిమాలోనూ లీడ్ రోల్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అనసూయ నుంచి అదిరిపోయే హాట్ షో

అనసూయ నుంచి అదిరిపోయే హాట్ షో

వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది బుల్లితెర యాంకర్ అనసూయ. ఇప్పటికే ఎన్నో షోలు, సినిమాల్లో నటిస్తోన్న ఈ అమ్మడు.. కార్తికేయ హీరోగా నటిస్తోన్న 'చావు కబురు చల్లగా' అనే సినిమాలో స్పెషల్ రోల్ చేయబోతుందని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. జానీ మాస్టర్ రూపొందించే ఈ మాస్ సాంగ్‌లో ఆమె అదిరిపోయే హాట్ షో చేయనుందని తెలుస్తోంది.

Recommended Video

Gatham Director Kiran Reddy About OTT || OTT ద్వారానే మూవీ అందర్నీ రీచ్ అయ్యింది !!
ఆ హీరోయిన్‌కు భారీ షాకిస్తూ... బాగానే

ఆ హీరోయిన్‌కు భారీ షాకిస్తూ... బాగానే

ఇక, ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేస్తోంది. ఇందుకోసం ఆమె రూ. 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందట. అయితే, మూడు నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం అనసూయ ఏకంగా రూ. 25 లక్షలు చార్జ్ చేసిందని అంటున్నారు. దీంతో సదరు హీరోయిన్‌కు భారీ షాక్ తగిలినట్లైంది. అంటే టాలీవుడ్‌పై అనసూయ బాగానే ప్రభావం చూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X