అనసూయ గ్లామర్ షో: ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో.. ఆయన పక్కన ఆమాత్రం ఉండాలి!

బుల్లితెరపై సత్తా చాటుతోన్న యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటోన్న ఆమె.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అదే సమయంలో ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. టెలివిజన్ రంగంలోనే కాక వెండితెరపైనా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కోసం ఆమె ఎంతగానో కష్టపడుతోంది. ఏది పడితే అది చేయకుండా స్క్రిప్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో గ్లామర్ షోకు రెడీ అయింది అనసూయ. వివరాల్లోకి వెళ్తే....

Recommended Video

Jabardasth Anchor Anasuya Hindi Web Series | Filmibeat Telugu

Photos: లావుగా ఉండే సెలబ్రెటీలు..ఇప్పుడు ఎంత నాజూగ్గా మారిపోయారో

అలా మొదలెట్టిన అనసూయ.. ఎన్టీఆర్‌తో స్టార్ట్

అలా మొదలెట్టిన అనసూయ.. ఎన్టీఆర్‌తో స్టార్ట్

నటన మీద ఉన్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే సినిమా అవకాశాల కోసం అన్వేషణ ప్రారంభించింది అనసూయ భరద్వాజ్. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రను పోషించింది. ఆ తర్వాత యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. కానీ, అవకాశాలు దొరకకపోవడంతో ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది.

జబర్ధస్త్ షోతో మారిన కెరీర్.. ఫుల్ పాపులారిటీ

జబర్ధస్త్ షోతో మారిన కెరీర్.. ఫుల్ పాపులారిటీ

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న కామెడీ షో జబర్ధస్త్‌ అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను మార్చేసింది. ఈ షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు, అద్భుతమైన నటన, ఆకట్టుకునే అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని సెలెబ్రిటీ అయింది.

వెండితెరపైనా సత్తా.. ఆ పాత్రలు మరవులేనివి

వెండితెరపైనా సత్తా.. ఆ పాత్రలు మరవులేనివి

బుల్లితెరపై తన మార్క్ చూపించిన అనసూయ.. సినిమాల్లోనూ నటించి మెప్పించింది. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన'లో చిన్న పాత్రలో కనిపించిన ఆమె.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. వీటిలో రామ్ చరణ్ సినిమాలో చేసిన రంగమ్మత్త పాత్ర విశేషమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. దీంతో ఎన్నో అవార్డులు దక్కాయి.

అనసూయకు కరోనా లక్షణాలు.. అప్‌డేట్ లేదు

అనసూయకు కరోనా లక్షణాలు.. అప్‌డేట్ లేదు

వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోన్న అనసూయ.. ఇటీవల ట్విట్టర్‌‌లో తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని పేర్కొంటూ ఓ లేఖను విడుదల చేసింది. ఆ సమయంలోనే తనతో పాటు ఉన్న అందరూ టెస్టులు చేయించుకోవాలని చెప్పింది. అలాగే, తానూ కరోనా పరీక్ష చేయించుకుంటానని వెల్లడించింది. కానీ, ఆ తర్వాత దీనికి సంబంధించిన అప్‌డేట్ మాత్రం ఇవ్వలేదామె.

అనసూయ గ్లామర్ షో.. గతంలో చూడని విధంగా

అనసూయ గ్లామర్ షో.. గతంలో చూడని విధంగా

ప్రస్తుతం అనసూయ పలు షోలతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో ఆమె స్పైసీ రోల్‌లో చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. దీని తర్వాత ఆమె పలు చిత్రాల్లో నటించేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ చూడని రీతిలో గ్లామర్ షో చేయడానికి సిద్ధం అయిపోయింది అనసూయ.

ఆయన పక్కన అంటే ఆమాత్రం ఉండాలి మరి

ఆయన పక్కన అంటే ఆమాత్రం ఉండాలి మరి

పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఇందులో గతంలో ఎన్నడూ చూడని గ్లామర్ గెటప్‌లో ఆమె కనిపించనుందని అంటున్నారు. జానపద గేయంగా ఇది రెడీ అవుతుందని తెలుస్తోంది. దీంతో పవన్ - అనసూయ కాంబోపై ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X