అనసూయ ఫ్యాన్స్‌కు పండుగే: స్పైసీ రోల్‌లో యాంకర్.. అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్

By Manoj

అనసూయ భరద్వాజ్.. తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న హాట్ యాంకర్. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అమ్మడు.. అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించుకుంది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెంచేసుకుంటోంది. టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. సినిమాల్లోనూ నటించి మెప్పిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరిచి ఫిల్మ్ మేకర్లను తన వైపునకు తిప్పుకుంటోంది. ఈ క్రమంలో అనసూయ ఓ సినిమాలో అవకాశం దక్కించుకుంది. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన కీలక విషయాన్ని సదరు డైరెక్టర్ వెల్లడించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వాటికి మంచి పేరు వచ్చింది

వాటికి మంచి పేరు వచ్చింది

అనసూయ చాలా కాలం కిందట వచ్చిన ఎన్టీఆర్ చిత్రం ‘నాగ' ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. క్రేజ్ వచ్చిన తర్వాత చేసిన ‘క్షణం', ‘సోగ్గాడే చిన్ని నాయన', ‘రంగస్థలం', ‘యాత్ర' చిత్రాలకు మంచి పేరు వచ్చింది. వీటిలో రంగమ్మత్త పాత్రకు మాత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

అక్కడ అమ్మడు ఫుల్ బిజీ

అక్కడ అమ్మడు ఫుల్ బిజీ

హాట్ యాంకర్ అనసూయ.. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. ఈ గ్యాప్‌లో మాత్రం అమ్మడు సోషల్ మీడియాలో బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే అను కూడా తరచూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దీంతో ఆమె ఫాలోవర్స్ క్రమంగా పెరుగుతున్నారు.

 ఆయన సినిమాకు సంతకం

ఆయన సినిమాకు సంతకం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించబోతున్న ‘రంగమార్తాండ' అనే సినిమాకు అనసూయ సంతకం చేసేసింది. ప్రకాష్ రాజ్‌, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొంత కాలంగా సరైన హిట్ దొరక్క ఇబ్బంది పడుతున్న కృష్ణ వంశీ.. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

స్పైసీ రోల్‌లో యాంకర్ అనసూయ

ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషించబోతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా డైరెక్టర్ కృష్ణ వంశీ అనసూయ పాత్రపై అందరిలో ఆసక్తి కలిగించారు. దీనికి కారణం ఆయన తన ట్విట్టర్‌లో ఆమె ఫొటోను షేర్ చేసి ‘అనసూయతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇందులో ఆమె స్పైసీ రోల్ చేస్తుంది' అని రాసుకొచ్చారు.

ఇది మామూలు సినిమా కాదు

ఇది మామూలు సినిమా కాదు

మరాఠిలో ఘన విజయం సాధించిన ‘నట సామ్రాట్‌' సినిమానే తెలుగులో ‘రంగమార్తండ' పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ ప్రధాన పాత్రలో నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నానా పటేకర్‌, విశ్వాస్‌ జోషీ నిర్మాతలు. చిన్న సినిమాగా వచ్చినా.. ఇది రూ. 50 కోట్లు పైగా వసూళ్లు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X