అనసూయ బాడీపై కుర్రాడి కొంటె కామెంట్లు: ఏకంగా అలా పోల్చుతూ పోస్ట్.. యాంకర్ ఘాటుగా రిప్లై!
అద్భుతమైన అందం.. అనితర సాధ్యమైన టాలెంట్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా ఎదిగిపోయింది యాంకర్ అనసూయ భరద్వాజ్. హోస్టుగా, నటిగా అదరగొడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. దీంతో ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుందామె. ఇలాంటి పరిస్థితుల్లో అనసూయపై సోషల్ మీడియాలో ఓ కుర్రాడు కొంటెగా కామెంట్లు చేశాడు. ఏకంగా ఆమెతో పోల్చుతూ పోస్టు పెట్టారు. ఆ వివరాలు మీకోసం!
Recommended Video

అప్పటి నుంచి అదరగొడుతోన్న అనసూయ
అంతకు ముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ.. జబర్ధస్త్ షోలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే గుర్తింపును అందుకుంది అనసూయ భరద్వాజ్. అందులో ఆమె చేసిన హోస్టింగ్‌కు.. కనిపించిన తీరుకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారిపోయిందామె. తద్వారా ఎన్నో ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.

బుల్లితెరపై అలా.. వెండితెరపై మాత్రం క్రేజీగా
జబర్ధస్త్ తర్వాత వరుసగా షోలు చేస్తూ సత్తా చాటుతోన్న అనసూయ.. 'సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. వీటన్నింటిలోనూ అత్యద్భుతమైన నటనను కనబరిచి ప్రశంసలు అందుకుంది. అన్నింటిలో రంగమ్మత్త పాత్రే హైలైట్ అని చెప్పొచ్చు.

అనసూయ దూకుడు... అదిరిపోయే ఆఫర్లు
ప్రస్తుతం అనసూయ జబర్ధస్త్ సహా ఎన్నో షోలను హోస్ట్ చేస్తోంది. అదే సమయంలో పలు చిత్రాల్లోనూ మంచి మంచి పాత్రలను పోషిస్తోంది. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ'లో నటిస్తోంది. దీనితో పాటు సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. అలాగే, పవన్ - క్రిష్ సినిమాలోనూ నటిస్తోందీ అమ్మడు.

సోషల్ మీడియాలో యాక్టివ్.. గ్లామర ఫొటో
వరుస సినిమాలు, షోలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది అనసూయ భరద్వాజ్. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా లంగావోణితో దిగిన కొన్ని పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది.

అనసూయ బాడీపై కుర్రాడి కొంటె కామెంట్లు
అనసూయ తాజాగా షేర్ చేసిన లంగావోణి ఫొటోను ఎడిట్ చేసిన ఓ కుర్ర నెటిజన్.. దానిపై మీమ్ క్రియేట్ చేశాడు. ఈ పిక్ పక్కన స్టార్ హీరోయిన్ సమంత ఫొటోను ఉంచిన అతడు.. 'నువ్వేమైన సమంతను అనుకుంటున్నావా' అంటూ ట్రోల్ చేశాడు. దీంతో ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీనిపై చాలా మంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తూ షేర్లు చేశారు.

ఇంకా పెరగలేదంటూ యాంకర్ ఘాటు రిప్లై!
నెటిజన్ చేసిన మీమ్ అనసూయ దృష్టికి చేరింది. దీంతో తన ఇన్‌స్టా స్టోరీలో దాన్ని షేర్ చేస్తూ.. 'లేదమ్మా. నన్ను అనసూయ అంటారు' అని ఆమె పోస్ట్ చేసింది. దీనికి సదరు కుర్రాడు 'సారీ మేడమ్.. జోక్ చేశాను' అంటూ స్పందించాడు. ఆ వెంటనే అనసూయ 'నువ్వింకా చిన్న పిల్లాడివే అనుకుంటున్నా. నువ్వు త్వరగా పెరగాలని (ఎదగాలని) కోరుకుంటున్నా' అంటూ రిప్లై ఇచ్చింది.


Click it and Unblock the Notifications











