అనసూయను బూతులు తిడుతూ అసభ్యకర పోస్ట్: దానికి సిగ్గు పడను.. పడిపోవడానికి కారణం చెబుతూ ఘాటుగా!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది హాట్ బ్యూటీలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. చాలా కాలంగా తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకుంటోన్న ఈ భామ.. తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. దీంతో సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనసూయను బూతులు తిడుతూ ట్విట్టర్‌లో ఓ అసభ్యకరమైన పోస్ట్ కనిపించింది. దీనికి ఈ యాంకర్ కూడా ఘాటుగానే బదులిచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Anchor Anasuya Live: She Loses her Mental Balance on Netizen over her Dressing

పూజా భలేకర్ అందాల విన్యాసాలు.. కురచ దుస్తుల్లో కాళ్లు పైకి ఎత్తి ఫోజు

అలా ఎంట్రీ ఇచ్చింది... అదరగొడుతోంది

అలా ఎంట్రీ ఇచ్చింది... అదరగొడుతోంది

కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో నటించింది అనసూయ. అక్కడ అంతగా గుర్తింపు దక్కకపోవడంతో న్యూస్ ప్రజెంటర్‌గా మారింది. ఆ తర్వాత జబర్ధస్త్ నిర్వహకుల దృష్టిలో పడింది. దీంతో ఆ షోలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడ మాత్రం విశేషమైన గుర్తింపును అందుకుంది. తనదైన శైలి యాంకరింగ్‌తో గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులర్ అయిందీ అమ్మడు.

సినిమాల్లోనూ సత్తా.. మంచి గుర్తింపుతో

సినిమాల్లోనూ సత్తా.. మంచి గుర్తింపుతో

జబర్ధస్త్ వల్ల వచ్చిన క్రేజ్‌తో సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో షోలను హోస్ట్ చేసింది అనసూయ. అదే సమయంలో 'సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. వీటన్నింటిలోనూ అత్యద్భుతమైన నటనను కనబరిచి ప్రశంసలు అందుకుంది.

పవన్‌తో తొలిసారి.. వాటిలోనూ చేస్తోంది

పవన్‌తో తొలిసారి.. వాటిలోనూ చేస్తోంది

ప్రస్తుతం అనసూయ జబర్ధస్త్ సహా ఎన్నో షోలను హోస్ట్ చేస్తోంది. అదే సమయంలో పలు చిత్రాల్లోనూ మంచి మంచి పాత్రలను పోషిస్తోంది. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ'లో నటిస్తోంది. దీనితో పాటు సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. అలాగే, పవన్ - క్రిష్ సినిమాలోనూ నటిస్తోందీ అమ్మడు.

అక్కడ ఫుల్ బిజీ.... వాళ్ల నుంచి ట్రోల్స్

అక్కడ ఫుల్ బిజీ.... వాళ్ల నుంచి ట్రోల్స్

వరుస సినిమాలు, షోలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది అనసూయ భరద్వాజ్. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. ఈ క్రమంలోనే శృతి మించిన హాట్ షో కారణంగా పలుమార్లు విమర్శలు ఎదుర్కొంది.

ఆమెపై బూతులతో అసభ్యకరమైన పోస్ట్

ఆమెపై బూతులతో అసభ్యకరమైన పోస్ట్

మూడేళ్ల క్రితం ఈటీవీలో ఓ స్పెషల్ ఈవెంట్ చేసింది అనసూయ. అందులో నాగబాబు, రోజా సహా జబర్ధస్త్ టీమ్ మొత్తం పాల్గొంది. అది చేస్తోన్న సమయంలో ఆమె కళ్లు తిరిగి కింద పడిపోయింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఇదిలా ఉండగా.. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు తీసిన ఓ నెటిజన్.. అనసూయను బూతులు తిడుతూ ట్విట్టర్‌లో అసభ్యకరమైన పోస్ట్ చేశాడు.

పడిపోవడానికి కారణం చెబుతూ కౌంటర్

పడిపోవడానికి కారణం చెబుతూ కౌంటర్

నెటిజన్ చేసిన పోస్టును రీట్వీట్ చేసిన అనసూయ.. 'కామెంట్లు చేయడం చాలా సులభం. కానీ, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత బీపీ తక్కువగా ఉండి ఇబ్బంది పడ్డ విషయం ఎవరికీ తెలీదు. మీరు చెప్పిన సంఘటన ఉదయం 5.30 గంటలకు జరిగింది. దీనికి కారణం ఈ ఈవెంట్ కోసం 22 గంటల పాటు షూట్ చేశాం. అందుకే అలా జరిగింది' అంటూ కౌంటర్ ఇచ్చిందామె.

నేను సిగ్గు పడను అంటూనే ఘాటుగా

నేను సిగ్గు పడను అంటూనే ఘాటుగా

దీనిని ప్రస్తావిస్తూ మరో ట్వీట్ కూడా చేసింది అనసూయ. 'నన్ను బూతులు తిట్టడానికి మూడు సంవత్సరాల క్రితం జరిగిన వీడియోను వాడుకున్నావు. నేను కూడా అలాంటి మాటలు అనడానికి సిగ్గు పడను. కానీ, నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు' అనే అర్థం వచ్చేలా ఘాటుగా బదులిచ్చింది. దీంతో ఈ యాంకరమ్మకు మద్దతుగా ఎంతో మంది కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X